
వైకాపా పాలనలో రైతులందరికీ న్యాయం జరగడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నివర్ తుపాను బాధిత రైతులను వైకాపా నేతలు కనీసం పరామర్శించలేదని ఆరోపించారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలోని పెదప్రోలులో ఆయన నివర్ బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు వారికి జరిగిన నష్టాన్ని జనసేనానికి వివరించారు. అనంతరం పవన్ అక్కడే మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో వరదలు వచ్చి ఇల్లు మునిగితే బాధితులకు రూ.10వేలు చొప్పున ఇచ్చారని.. ఇక్కడ ఎకరం పొలం మునిగితే ప్రభుత్వం అంతే ఇవ్వడం సరికాదన్నారు.