
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన కడప నుంచి ఢీల్లీ విమానం ఎక్కనున్నారు. రాష్ట్రంలోని పెండింగ్ నిధులపై చర్చించేందుకు ప్రధానమంత్రి మోడిని కలవనున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు ప్రధాని అపాయింట్‌మెంట్ కోరారు. ప్రధాని మోదీతో భేటి ముగిసిన తరువాత రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఇటీవల ఆయన ఢీల్లీ వెళ్లి ప్రధాని మోదీతోపాటు కేద్రమంత్రులను కలిశారు. తాజాగా మరోసాని ఆయన ప్రధానిని కలవడంపై ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం పెండింగ్ నిధులు, రాష్ట్రానికి రావాల్సిన నిధల కోసమే ఢిల్లీ వెళుతున్నారని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
Also Read: మందుబాబులకు జగన్ సర్కార్ భారీ షాక్..?