
కర్నూల్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని బనగానపల్లి మండలం తమ్మడపల్లెకు చెందిన ఓ కామాంధుడు బయట ఆడుకుంటున్న పాపను తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆసుపత్రికి తరలించగా రేప్ జరిగినట్లు వైద్యులు గుర్తించారని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నట్లు వారు తెలిపారు.