
ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మంగళవారం నుంచి రైతు ఖాతాల్లోకి రైతు భరోసా సొమ్మును జమ చేయనుంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం అందించే కిసాన్ సమ్మాన్ నిధి మొత్తం కూడా జమ కానుంది. కౌలు రైతులతో పాటు ఆర్ఎఫ్ఆర్ పొంది సాగు చేస్తున్న రైతుకు ఈ ప్రయోజనం కలగనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ప్రతీ రైతుకు 13,500 చొప్పున ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 అందించిన ప్రభుత్వం మూడో విడతలో రూ.2000 అందించనుంది. దాదాపు 51 లక్షల రైతులు రైతు భరోసా ప్రయోజనం పొందనున్నారు.