రామతీర్థం ఘటనలో చంద్రబాబుపై కేసు నమోదు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి చేశారని టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదైంది. విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయానికి నిన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విగ్రహ ధ్వంసం సంఘటనలో పరిశీలనకు వచ్చారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ నేత కళా వెంకట్రావులు రామతీర్థం వచ్చారు. ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డిపై రాళ్లదాడి జరిగింది. ఈ దాడి చంద్రబాబే చేయించాడని ఆరోపిస్తూ నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు […]
Written By:
, Updated On : January 3, 2021 / 09:04 PM IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి చేశారని టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదైంది. విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయానికి నిన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విగ్రహ ధ్వంసం సంఘటనలో పరిశీలనకు వచ్చారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ నేత కళా వెంకట్రావులు రామతీర్థం వచ్చారు. ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డిపై రాళ్లదాడి జరిగింది. ఈ దాడి చంద్రబాబే చేయించాడని ఆరోపిస్తూ నెల్లిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో ఈ ముగ్గురిపై పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.