ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తరువాత రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.జూన్ 2న ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా ఆరోజునే వేడుకలు నిర్వహిస్తూ వస్తోంది. తాజా ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 1 అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది.