
నివర్ తుపాను కారణంగా రాష్ట్రంలో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సీడి విడుదలకు పాలనానుమతులు ఇచ్చింది ప్రభుత్వం. రూ. 601.66 కోట్ల మేర ఇన్ పుట్ సబ్సీడీ చెల్లింపునకు అనుమతులు జారీ అయ్యాయి. శ్రీకాకుళం మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని 7 లక్షల 82 వేల 649 మంది రైతులకు నష్టం వాటిల్లినట్టు ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా 4 లక్షల 59 వేల 608 హెక్టార్లలోని పంట దెబ్బతిన్నట్టు పేర్కొంది పేర్కోన్న వ్యవసాయ శాఖ. ఉద్యాన పంటలు నష్ట పోయిన రైతులకు రూ. 44.33 కోట్ల మేర ఇన్ పుట్ సబ్సీడీ చెల్లింపునకు పాలనానుమతి ఇచ్చింది ప్రభుత్వం.