
ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో శనివారం ఆయన కరోనా పరీక్షలు చేయించుకోవడంతో ఆయనకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ఆయనను కలిసిన వారిలో ఆందోళన మొదలైంది. కాగా వైద్యుల సూచన మేరకు ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లినట్లు సన్నిహితులు తెలిపారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడ్డారు. కేసులు తగ్గుతున్నాయనుకుంటున్న సమయంలో ప్రముఖులు కరోనా బారిన పడడం ఆందోళనను కలిగిస్తోంది.