
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్ టెస్ట్) ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు.. ఈ పరీక్షలకు మొత్తం 51,991 మంది అభ్యర్థులు హాజరుకాగా 40,890 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈనెల 10,11వ తేదీల్లో పరీక్షలు నిర్వహించగా రికార్డుస్థాయిలో ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను sche.ap.gov.in ద్వారా చూసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
Also Read: అలెర్ట్: మరో 24 గంటలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక