Pulivendula By-elections 2025: పులివెందుల( pulivendula) జడ్పిటిసి ఉప ఎన్నికలను వైసీపీ బహిష్కరిస్తుందా? అక్కడ ఆ పార్టీకి ఓటమి తప్పేలా లేదా? టిడిపి పట్టు బిగిస్తోందా? వైసిపి ద్వితీయ శ్రేణి నాయకత్వం ముఖం చాటేస్తోందా? కేసులకు వైసీపీ నేతలు భయపడుతున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. వైసీపీ నుంచి గెలుపొందిన జడ్పిటిసి అకాల మరణంతో.. ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిడిపి కూటమి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. బలమైన అభ్యర్థిగా భావిస్తున్న బీటెక్ రవి సతీమణి లలితా రెడ్డి రంగంలోకి దిగారు. అయితే ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ అభ్యర్థి పట్టు బిగిస్తుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో పాలు పోవడం లేదు. అందుకే ఈ ఎన్నికల నుంచి వైసీపీ తప్పు ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
Also Read: టీటీడీ సంచలన నిర్ణయం!
సమన్వయంతో కూటమి..
ఈనెల 12న ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలను ప్రకటించనున్నారు. అయితే అధికార పార్టీ అభ్యర్థి బరిలో ఉండడంతో కూటమి పార్టీల శ్రేణులు సర్వశక్తులు ఉపయోగిస్తున్నాయి. బిజెపి నుంచి ఆదినారాయణ రెడ్డి( adhinarayana Reddy) రంగంలోకి దిగారు. పులివెందుల మండలం లో ఉన్న ప్రతి గ్రామంలో.. గ్రామ పెద్దలను కలిసి సాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి సైతం వ్యూహాలు రూపొందిస్తున్నారు. భవిష్యత్తు రాజకీయాలకు వ్యూహాలు రూపొందించుకునే పనిలో ఉన్నారు బీటెక్ రవి. జడ్పిటిసి ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా.. తెలుగుదేశం పార్టీలో మరింత పలుకుబడి సంపాదించాలని.. కీలక పదవుల దిశగా ఆలోచన చేస్తున్నారు.
వైసిపి కి సంక్లిష్టమే..
ఈ ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశం ( Telugu Desam) పార్టీకి పోయేదేమీ లేదు. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం ఆ పార్టీ పని అయిపోయిందని రాష్ట్రవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే ఏమంత బాగాలేదు. ముఖ్యంగా ప్రత్యర్ధులు వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగంలో ఉన్నారు. ఆపై వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ సైతం పోటీ చేస్తున్నారు. పులివెందులతో వివేకానంద రెడ్డికి విడదీయరాని బంధం. ఇప్పటికే వైసీపీలో ఉన్న చాలామంది వైయస్సార్ అభిమానులు చాలా బాధపడుతుంటారు. ఒకవైపు వైఎస్ అవినాష్ రెడ్డి, సునీల్ యాదవ్ కనిపిస్తుండడంతో వివేకా హత్య అంశమే అభిమానుల చుట్టూ పనిచేస్తుంది. అందుకే వారు అంకితభావంతో వైసిపి గెలుపు కోసం కృషి చేయలేకపోతున్నారు. ఇవన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మైనస్ గా మారనున్నాయి.
Also Read: కమ్ముకొస్తున్న మేఘాలు.. ఏపీకి భారీ హెచ్చరిక
విధ్వంసం పేరు చెప్పి..
ప్రతిపక్షంలో ఉంటే ఉప ఎన్నికలను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఈ విషయం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి తెలియంది కాదు. 2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. అయినా సరే కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది అక్కడ. అటువంటి చోట అదే స్థానిక సంస్థల నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్ వివేకానంద రెడ్డి ఓడిపోయారు. ఆయనపై టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన బీటెక్ రవి గెలిచారు. ఒకవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి క్యాడర్ ఇప్పుడు చెదిరిపోయింది. అధికారంలో ఉన్నప్పుడు తమకు ఏమీ చేయలేదన్న ఆవేదనతో ఉంది. ఇంకోవైపు కూటమి దూకుడు మీద ఉంది. అందుకే పులివెందులలో అధికారపక్షం విధ్వంసం సృష్టిస్తోందని ఆరోపించి.. వైసిపి ఎన్నికలను బహిష్కరించే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?..