YSR Death Anniversary: రాజకీయంగా ఎంతో మంది నేతలు వస్తుంటారు.. పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. తమకంటూ ఒక ముద్ర చాటుకుంటారు. ఒక్కో నేతది ఒక్కో ముద్ర. సంక్షేమం విషయంలో నందమూరి తారక రామారావు బలమైన ముద్ర చాటితే.. వైయస్ రాజశేఖర్ రెడ్డి( y s Rajasekar Reddy ) సంక్షేమానికి ఆధ్యుడిగా మారారు. పేద ప్రజలకు విద్య, వైద్యం తో పాటు సంక్షేమ పథకాలు అందించారు. అయితే రాజకీయాల్లో తట్టుకుని నిలబడి.. అధికారం చేపడితే కానీ ఆ పనులు చేయలేరు. 1978లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. 2004లో ముఖ్యమంత్రి పదవి అధిరోహించారు రాజశేఖర్ రెడ్డి. ఎన్నో ముళ్ళను దాటుకుంటూ ఆ స్థానాన్ని అందుకున్నారు. అయితే అదే మాదిరిగా కష్టాలను ఎదుర్కొని ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు కొణిదల పవన్ కళ్యాణ్. ప్రజారాజ్యం పార్టీ ద్వారా గుణపాఠాలు నేర్చుకుని.. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసి.. దానిని జనసేన రాజకీయ పార్టీగా మార్చి.. సుమారు దశాబ్ద కాలం పోరాటం చేస్తే కానీ పవన్ కళ్యాణ్ ఈ స్థానానికి చేరుకోలేకపోయారు. ఒక విధంగా చెప్పాలంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కు దగ్గర సంబంధాలు కనిపిస్తాయి. అయితే ఆ మహానేత అస్తమించారు. అదే రోజున ఏపీ రాజకీయాల్లో ఉదయించారు పవన్ కళ్యాణ్. నేడు వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కాగా.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. అందుకే ఎక్కువమంది రాజశేఖరరెడ్డి తో పవన్ కళ్యాణ్ ను పోల్చుతున్నారు.
Also Read: ఈ వయసులో అంబటి రాంబాబు.. వైరల్ వీడియో
* కాంగ్రెస్ రాజకీయాలను ఎదుర్కొని..
రాజకీయం అంటే సేవగా భావించేవారు రాజశేఖర్ రెడ్డి. ఫ్యాక్షన్ నేపథ్యం నుంచి వచ్చిన ఆ ముద్ర పడకుండా జాగ్రత్తపడ్డారు. వైద్య వృత్తిలో అడుగుపెట్టి పులివెందులలో( pulivendula) పేదల డాక్టర్ గా గుర్తింపు సాధించారు. తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. చట్టసభల్లో అడుగుపెట్టారు. సుదీర్ఘకాలం రాజకీయాలు చేస్తూ లోటుపాట్లను గుర్తించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజల మనసును అర్థం చేసుకున్నారు. వారి బాధలను తెలుసుకున్నారు. సామాన్యుడి గుండెచప్పుడుగా మారారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలను అందజేశారు. అదే సమయంలో అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్ర పురోభివృద్ధికి అంకితమయ్యారు రాజశేఖర్ రెడ్డి. ఆయన 2009 సెప్టెంబర్ 2న అకాల మరణం పొందారు.
* ఎన్నో కష్టాలను తట్టుకొని..
2009లో ప్రజారాజ్యం( Praja Rajyam) పార్టీ ఆవిర్భవించింది. ఆ ఎన్నికల్లో ఓడిపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం అయింది. దీంతో పవన్ కళ్యాణ్ సైతం సైలెంట్ అయ్యారు. అయితే రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత.. పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రజల కోసం గొంతు ఎత్తే సంస్థగా మార్చారు. అక్కడికి కొద్ది రోజులకే జనసేన పార్టీగా మార్చారు. ఆ ఎన్నికల్లో సీనియారిటీని గౌరవించి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. కేంద్రంలో ఎన్డీఏ కు మద్దతు ఇచ్చారు. రెండు చోట్ల తాను మద్దతు ఇచ్చిన పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు పవన్. 2014 నుంచి 2019 మధ్య ఎన్నో రకాల సమస్యలకు పరిష్కార మార్గం చూపించగలరు. అప్పటి టిడిపి ప్రభుత్వంతో పనులు చేయించారు. 2019లో వామపక్షాలతో కలిసి పోటీ చేశారు పవన్. కానీ దారుణ పరాజయం ఎదురయింది. తాను పోటీ చేసిన రెండు సీట్లలో సైతం పవన్ ఓడిపోయారు. ఇక మరో ప్రజారాజ్యం పార్టీ జనసేన అంటూ ప్రచారం మొదలుపెట్టారు. రెండు చోట్ల ఓడిపోయిన నాయకుడు ఒక నేతయేనా అని ఎగతాళి చేశారు. కానీ వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డారు. కష్టాలను అధిగమించి.. టిడిపి తో జత కలిసి.. బిజెపిని ఒప్పించి.. మూడు పార్టీల మధ్య పొత్తు కుదుర్చుకొని.. ఘన విజయం సాధించారు పవన్. జనసేన శత శాతం విజయంతో ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు పవన్.
* అదే పోరాట పటిమ
అయితే విపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖరరెడ్డి మాదిరిగా పోరాటపటిమ చూపిన ఘనత పవన్ ది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజలతో మమేకమై పనిచేశారు. అధికారంలోకి వచ్చాక రాజశేఖర్ రెడ్డి మాదిరిగా సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలని ఆకాంక్షించారు. టిడిపి కూటమికి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. కష్టం ఉన్న ప్రతి చోటా వాలిపోతున్నారు పవన్. అయితే యాదృచ్ఛికమో తెలియదు కానీ పవన్ పుట్టినరోజు నాడే రాజశేఖర్ రెడ్డి మరణించారు. అయితే ఆ మహానేత చనిపోయిన రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని చాలా సందర్భాల్లో నియంత్రించారు పవన్. తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. కానీ ఏపీ ప్రజలు మాత్రం రాజశేఖరరెడ్డి లాంటి మహానేత దివికేగినా.. ఆయన లాంటి మరో నేత పవన్ జన్మించాడు అంటూ అభిప్రాయపడుతున్నారు.