YSR Congress Latest News: వైఎస్సార్ కాంగ్రెస్(YSR Congress) పార్టీ అన్నింట్లోనూ ప్రత్యేకమే. అక్కడంతా సోలో పెరఫ్మారెన్స్. పార్టీకి పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ ఉన్నా ఆ సమావేశం ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి. అసెంబ్లీకి ఎలాగూ హాజరుకావడం లేదు. మండలికి హాజరవుతున్నా ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమైన సందర్భాలు లేవు. పోనీ ఇప్పుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నా జాతీయ స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహం, ఏపీ విషయంలో ప్రస్తావించాల్సిన విషయాల గురించి అస్సలు పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి. అయితే వారికి జాతీయ స్థాయిలో స్టాండ్ అంటూ ఏమీ లేదని అర్థమవుతోంది. బీజేపీని వ్యతిరేకించలేరు. కాంగ్రెస్ తో కలవలేరు. కానీ పీఏసీ సమావేశానికి వెళ్లినట్టు.. అక్కడ నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చినట్టు మాత్రం ఆ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి చెబుతుంటారు.
మంచి అవకాశాన్ని వదులకొని..
ఇప్పడు దేశవ్యాప్తంగా ఓటర్ల సవరణ, సమగ్ర జాబితాలపై చర్చ జరుగుతోంది. అన్ని పక్షాలు బీజేపీ (Bharateeya Janatha Party)చర్యలను వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీతొ టీడీపీ బంధాన్ని కొనసాగిస్తోంది. రోజురోజుకు వారి మధ్య మైత్రి బలపడుతోంది. టీడీపీకి బద్ద శత్రువులా చూస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ బీజేపీని వ్యతిరేకించడం లేదు సరికాదా.. గుడ్డిగా మద్దతు తెలుపుతోంది. కానీ ప్రజాసమస్యలపై అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావిస్తున్నట్టు మాత్రం ప్రకటిస్తోంది. అంతెందుకు ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ చేసి కూటమి గెలిచినట్టు ఆరోపణలు చేస్తోంది. కానీ ఈ విషయంలో కార్నర్ చేసేందుకు మంచి అవకాశం పార్లమెంట్లో ఉంది. కానీ అంతటి మంచి అవకాశాన్ని మాత్రం వినియోగించుకునే పరిస్థితిలో లేదు. కనీసం పార్లమెంట్ లో ఆ ప్రస్తావన చేసిన దాఖలాలు కూడా ఉండవు.
తమ గురించే నిత్యప్రస్తావన..
ఈ రోజుల పార్లమెంట్లో ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి (Peddireddy Mithun reddy)మాట్లాడారు. ఎంతవరకూ ఏపీలో తమ అరెస్టులు జరిగాయి. ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు మోపుతోంది. లేనిపోని కేసులు పెట్టి ఇబ్బందిపెడుతోంది అని మాత్రమే చెబుతున్నారు. కానీ ఏపీ ప్రజల సమస్యలు ప్రస్తావించడం లేదు. కేంద్ర ప్రభుత్వపరంగా వైఫల్యాలను ఎత్తిచూపడం లేదు. అలాగని కేంద్రం కోరినా..కోరకపోయినా మాత్రం బిల్లులకు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉంటోంది. అయితే ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ గొప్పగా చెప్పుకోవచ్చు కానీ.. కేంద్రంలో, జాతీయ స్థాయిలో మాత్రం చెప్పుకునేందుకు ఏం లేదు. ఎందుకంటే పార్లమెంట్ లోపల, బయటా వైఎస్సార్ కాంగ్రెస్ మాటలు గురించి అందరికీ తెలిసిన విషయమే.