Homeఆంధ్రప్రదేశ్‌Viral Video : చంద్రబాబుపై అటాక్ మొదలుపెట్టిన వైసిపి.. కీలక ఆధారాలతో సంచలనం.. వైరల్ వీడియో

Viral Video : చంద్రబాబుపై అటాక్ మొదలుపెట్టిన వైసిపి.. కీలక ఆధారాలతో సంచలనం.. వైరల్ వీడియో

Viral Video :  ఆస్తుల వ్యవహారం వల్ల జగన్ మరింత బద్నాం అవుతున్న నేపథ్యంలో.. వైసిపి కీలక నేత పేర్ని నాని రంగంలోకి దిగారు.. టిడిపి దూకుడుకు.. దాని అనుబంధ మీడియా చేస్తున్న ప్రచారానికి ముకుతాడు వేయాలని ఉద్దేశంతో సరికొత్త ఆధారాలను తెరపైకి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు మాతృమూర్తి అమ్మనమ్మ కు మదినగూడ లో 5 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉందట. దానిని ఆమె లోకేష్ పేరు మీద రాశారట. చంద్రబాబు నాయుడు మాతృమూర్తి అమ్మనమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ కూడా సంతానం ఉంది. అయితే అందరిలోనూ కేవలం లోకేష్ కు మాత్రమే ఆమె 5 ఎకరాలు ఆయన పేరు మీద రాశారట. అయితే మిగతా వారి పేరు మీద ఎందుకు రాయలేదు అని పేర్ని నాని ప్రశ్నించారు. ఈ వీడియోను వైసిపి సోషల్ మీడియా అనుబంధ గ్రూప్ లలో తెగ షేర్ చేస్తున్నారు.. దీనికి జనసేన నాయకులు, టిడిపి నాయకులు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఆయనపై ఆరోపణలు చేయలేదని.. నోటీసులు కూడా జారీ చేయలేదని.. ఆ విషయాన్ని పేర్ని నాని ఎలా మర్చిపోయారని వారు గుర్తు చేస్తున్నారు. జగన్ మీద ఆయన సోదరి ఆరోపణలు చేశారని.. ఆస్తులకు సంబంధించి ఇద్దరి మధ్య వివాదాలకు కొనసాగుతున్నాయని.. అవి ఏకంగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ దాకా వెళ్ళాయని.. దానిని కవర్ చేయడం కోసమే నాని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వారు మండిపడుతున్నారు.

ఆసక్తికరమైన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు..

జగన్ – షర్మిల మధ్య ఆస్తుల వివాదం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని పేర్ని నాని తెరపైకి తీసుకురావడం మీడియాలో చర్చకు దారి తీసింది. మదినగూడ లో ఉన్న ఐదు ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు మాతృమూర్తి అమ్మనమ్మ లోకేష్ పేరు మీద రాసిన విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదు. అయితే టిడిపి, దాని అనుబంధ మీడియా పదేపదే జగన్ – షర్మిల మధ్య ఆస్తుల వివాదాన్ని ప్రస్తావించడంతో వైసిపి ఆలస్యంగా రంగంలోకి దిగింది. రాజకీయంగా ఇది నష్టం చేకూర్చుతోందని భావించి.. పేర్ని నాని ద్వారా సంచలన విషయాలను వెల్లడించింది. మదినగూడ 5 ఎకరాల వ్యవసాయ క్షేత్ర విషయాన్ని వైసిపి ప్రస్తావించడంతో.. సాక్షి మీడియా దానిని బొంబాట్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే తెలుగుదేశం, జనసేన నాయకులు అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో మొత్తానికి లోకేష్ పేరు మీద అమ్మనమ్మ రాసిన ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి తన కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదానికి సంబంధించి తొలిసారి స్పందించారు. ఇది అందరి కుటుంబాలలో జరుగుతున్నదేనని.. చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఈ విషయాన్ని వాడుకుంటున్నారని మండిపడ్డారు. జగన్ – షర్మిల ఆస్తుల వివాదం ఎటువైపు వెళుతుందో తెలియదు గాని.. ప్రస్తుతానికి అయితే ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version