Anchor Kavyasri : అమ్మాయిలపై దాడులు ఆపాలంటూ వివిధ మార్గాల ద్వారా ప్రచారం చేస్తన్నా.. అవగాహన కల్పిస్తున్నారు.. వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఏదో ఒక కారణంతో వారిపై చేయి చేసుకోవడం జరుగుతూనే ఉన్నాయి. పెళ్లయిన వారు.. పెళ్లి కాని వారు ఏదో రకంగా కొందరి మగాళ్ల చేతిలో దెబ్బలు తినాల్సి వస్తుంది. అయితే సాధారణ వ్యక్తుల కంటే ఈ మధ్య సెలబ్రెటీల విషయంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.తాజాగా ఓ యాంకర్ తో పాటు అతని తండ్రిపై ఓ వ్యక్తి దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో యాంకర్ కు గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అమ్మాయిలపై దాడులు ఇంకా ఆగలేదు.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ ఆ సెలబ్రెటీ ఎవరు? అసలేం జరిగింది?
ప్రముఖ ఛానెల్ లో యాంకర్ గా పనిచేస్తున్న కావ్య శ్రీ తన తండ్రితో కలిసి రాజమండ్రిలోని ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. అయితే ఆ సమయంలో కావ్య శ్రీ తో పాటు ఆమె తండ్రిపై నల్లూరి శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి దాడి చేశారు. దీనిపై కావ్య శ్రీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడికి కారణం పరిశీలించగా.. నల్లూరు శ్రీనివాస్ అనే వ్యక్తికి కావ్య తండ్రి డబ్బులు ఇచ్చాడు. అయితే తమ డబ్బులు ఇవ్వాలని నల్లూరి శ్రీనివాస్ ను పదే పదే అడగగా.. తమపై కోపం తెచ్చుకున్న ఆయన ఈ ఈవెంట్ లో తమపై దాడి చేశాడని కాశ్య శ్రీ వాపోయింది.
ఈ దాడిలో కావ్య శ్రీ కన్నుకు గాయం అయినట్లు తెలిపింది. అలాగే తన తండ్రిపై నల్లూరి శ్రీనివాస్ పిడిగుద్దులు కురిపించాడని ఆవేదన చెందింది. అలాగే తనతో పాటు తన కూతురుపై తీవ్రంగా దాడి చేశాడని కావ్య శ్రీ తండ్రి కూడా చెప్పారు. నల్లూరి శ్రీనివాస్ అవసరాల కోసం డబ్బు సాయం చేస్తే తమకు ఇవ్వకపోగా తిరిగి తమపై దాడి చేశారని వారు వాపోయారు. అడిగిన ప్రతీ సారి తన దగ్గర లేవంటూ కాలం వెళ్లదీశాడని చెప్పారు. ఆడపిల్ల అని చూడకుండా తనపై దాడి చేశాడని కావ్య శ్రీ వాపోయింది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో తీస్తున్నా.. ఏమాత్రం బెదురు లేకుండా దాడి చేశాడని ఆమె వాపోయింది. అంతేకాకుండా ఇటీవల ఆడపిల్లలపై దాడులు పెరిగిపోతున్నాయన, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపింది. మహిళలకు రక్షణ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. మహిళలపై ఎలాంటి గౌరవం లేకుండా ఏకంగా దాడులు చేయడం అవమానకనీయమని కావ్య శ్రీ వాపోతుంది. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాని ఆమె కోరుతోంది.
ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ ఇటీవల ఘోరమైన సంఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. జోగులాంబ గద్వాల జిల్లాలోనూ ఓ మహిళపై ఆసాధారణ దాడి జరిగింది. మహిళలపై దాడులు చేసిన వారని కఠినంగా శిక్షించాలని కొందరు వేడుకుంటున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా చట్టాలు ఉన్నా వాటిని అమలు పరచడంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Yscp leader attacked anchor kavyasri and his father at rajamundry
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com