Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila: యలహంక ప్యాలెస్ షర్మిలదే.. తేల్చి చెప్పిన వైయస్ రాజశేఖర్ రెడ్డి.. నాడు ఏం...

YS Sharmila: యలహంక ప్యాలెస్ షర్మిలదే.. తేల్చి చెప్పిన వైయస్ రాజశేఖర్ రెడ్డి.. నాడు ఏం జరిగిందంటే..

YS Sharmila: అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. నాటి రోజులలో సత్యం కుంభకోణం జరిగింది. యావత్ దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది. దర్యాప్తు సంస్థలు పని మొదలుపెట్టాయ్. సత్యం రామలింగరాజు అరెస్టు అయ్యారు. ఇంకా రకరకాల పరిణామాలు వేగంగా సాగిపోతున్నాయి. ఇంతలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. నాటి అక్కడి ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది. కుటుంబంతో కలిసి మూడు రోజులపాటు ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొనాలసి ఉందని రాజశేఖర్ […]

YS Sharmila: అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. నాటి రోజులలో సత్యం కుంభకోణం జరిగింది. యావత్ దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది. దర్యాప్తు సంస్థలు పని మొదలుపెట్టాయ్. సత్యం రామలింగరాజు అరెస్టు అయ్యారు. ఇంకా రకరకాల పరిణామాలు వేగంగా సాగిపోతున్నాయి. ఇంతలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి బెంగళూరు వెళ్లారు. నాటి అక్కడి ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించింది. కుటుంబంతో కలిసి మూడు రోజులపాటు ప్రైవేట్ కార్యక్రమాలలో పాల్గొనాలసి ఉందని రాజశేఖర్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బందికి చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేశారు.

కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు పని పూర్తి చేసుకున్న తర్వాత.. 2009 జనవరి 16 రాజశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి విజయలక్ష్మి, కుమారుడు జగన్మోహన్ రెడ్డి, కోడలు భారతి, కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్, మనుమలు, మనమరాళ్లతో కలిసి రాజశేఖర్ రెడ్డి యలహంక వెళ్లారు. అప్పటికి అంజలి వయసు ఏడు సంవత్సరాలు.

సరిగ్గా జనవరి 16న ఆమె జన్మదినం. దాని పురస్కరించుకొని గృహప్రవేశ వేడుకను రాజశేఖర్ రెడ్డి దగ్గరుండి జరిపించారు. పైగా షర్మిల నివాసాన్ని అత్యంత దగ్గరుండి కట్టించారు. షర్మిల అభిరుచికి తగ్గట్టుగానే రాజశేఖర్ రెడ్డి ఆ ఇల్లు నిర్మించారని ఇప్పటికి చెబుతుంటారు. నాడు ఏడు సంవత్సరాల వయసులో ఉన్న అంజలి ఇప్పుడు 24 ఏళ్ల వయసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో షర్మిల ఆమెకు పెళ్లి ఖరారు చేశారు. ఈనెలలో తనకు తన తండ్రి కట్టించిన నివాసంలో వివాహం జరిపేందుకు నిర్ణయించారు. కాని దీనిని జగన్ అడ్డుకుంటున్నారు.

ఇప్పటికే షర్మిలకు లేఖలు రాశారు. వాస్తవానికి ఆ ఆస్తి మొత్తం జగన్ ది అని వైసిపి నాయకులు.. సాక్షి మీడియా వాదిస్తోంది. కానీ నాడు జరిగిన విషయం మొత్తం ప్రఖ్యాత ఆంగ్ల పత్రికలో తాటికాయ పరిమాణంలో ప్రచురితమైనది. ఇదే విషయాన్ని టిడిపి నేతలు బయటపెడుతున్నారు. ఆడపిల్లను ఇబ్బంది పెట్టి.. ఆమెను ఏడిపించి.. జగన్ తన పైశాచిక ఆనందం పొందుతున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ప్యాలెస్ విషయంలో జాతీయ మీడియా సైతం నాడు జరిగిన వ్యవహారాన్ని ప్రధానంగా ప్రచురించడంతో జగన్ అండ్ కో కు నోటి వెంట మాట రావడం లేదు. రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే యలహంక ప్యాలెస్ లో ఎవరి ఇల్లు వారికి కట్టించారు. చెరి పది ఎకరాలలో నివాస సముదాయాలు నిర్మించారు. కానీ, షర్మిల నివాసాన్ని కూడా తనదే అని జగన్ చెప్పడం ఇక్కడ అసలైన ఐరనీ.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper