RK Kotha Paluku: ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం అంతకంతకు పెరుగుతోంది. గతంలో వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తుల విషయంలో పంపకం సరిగా లేదని.. ఎక్కువ ఆస్తులు మొత్తం జగన్ దగ్గర ఉన్నాయని షర్మిల ఆరోపిస్తోంది. ఇటీవల విజయలక్ష్మి కూడా ఒక లేఖ విడుదల చేశారు. అందులో షర్మిలకు సమానంగా ఆస్తులు పంపిణీ చేయలేదని.. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్, షర్మిల పిల్లలకు సమానంగా ఆస్తులు పంచాలని నిర్ణయించాలని విజయలక్ష్మి పేర్కొన్నారు. అంతేకాదు ఆ విషయాన్ని ఒక నోటరీ రూపంలో ఆమె బయటపెట్టారు.
Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆస్తులు వివాదానికి సంబంధించి అసలు విషయాలను ఇంతవరకు ఎవరూ బయటికి చెప్పలేదు. అయితే ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఆదివారం రాసిన కొత్త పలుకులో సంచలన విషయాలను వెల్లడించారు. ఈ ప్రకారం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఆస్తులు లేవట. ఆ తర్వాత ఆస్తులు కొండల మాదిరిగా పెరిగిపోయాయట. ఆయన అధికారంలో ఉన్నప్పుడు గా అవినీతికి పాల్పడ్డారట. చివరికి ఇదే విషయాన్ని అమెరికన్ కాన్సులేట్ ఒక లేఖ రూపంలో బయటపెట్టిందట. అయితే రాజశేఖర్ రెడ్డి బతికున్నప్పుడు ఆస్తులను సరిగ్గా పంపిణీ చేయాలని అనుకున్నప్పుడు.. విజయసాయిరెడ్డి అడ్డుపడ్డారట.. జగన్ పేరిట ఆస్తులు నమోదైన తర్వాత.. గిఫ్ట్ డీడ్ కింద ఇవ్వచ్చని సూచించారట. దీంతో రాజశేఖర్ రెడ్డి ఆ విషయంలో నిశ్శబ్దంగా ఉన్నారట. ఆయన గతించిన తర్వాత ఆస్తుల వివాదం ఏర్పడిందట.
జగన్ గ్రహ స్థితి ఈ ఏడాది బాగోలేదట. అందువల్లే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు రాధాకృష్ణ స్పష్టం చేశారు. వాస్తవానికి షర్మిల, జగన్ మధ్య ఆస్తుల వివాదం ఉండుంటే మొదట్లోనే వారిద్దరూ వాగ్వాదానికి దిగేవారు. అయితే రాజకీయంగా ఏర్పడిన విభేదాలు ఇంతటి దాకా తీసుకొచ్చాయి. వాటికి ఆస్తుల పంపకం కూడా తోడు కావడంతో వివాదం మరింత పెరిగింది. ఈ వ్యవహారంలో అటు జగన్.. షర్మిల పంతాలకు పోతున్న నేపథ్యంలో రాధాకృష్ణ లాంటివాళ్ళు సొంత భాష్యం చెప్పాల్సి వస్తోంది. విజయ సాయి రెడ్డి కూడా దూరం కావడంతో ఆ కుటుంబంలో ఆస్తుల వివాదం మరింత పెరిగింది.
జగన్ ఆస్తుల వివాదాన్ని మాత్రమే కాకుండా.. ఇటీవల సుప్రీంకోర్టు ప్రకటించిన దళిత క్రైస్తవుల అంశాన్ని కూడా రాధాకృష్ణ ప్రస్తావించారు. గతంలో దళిత క్రైస్తవులకు జగన్ అండగా నిలిచారని.. ప్రభుత్వం తరఫున గౌరవ పారితోషికం అందించారని.. అందువల్లే ఆయన సమావేశాలలో దళిత క్రైస్తవులు హడావిడి చేసేవారని రాధాకృష్ణ గుర్తు చేశారు. ఒక మీడియా అధిపతిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాని రాధాకృష్ణ తన టెంపర్మెంట్ మొత్తం ఇందులో చూపించాడు. తనకు వ్యతిరేకత వస్తుందని.. తన పత్రిక పై దుష్ప్రచారం చేస్తారని తెలిసినప్పటికీ కూడా ఇలాంటి డేరింగ్ కామెంట్స్ చేయడం అతనికి మాత్రమే చెల్లింది.. దళిత క్రైస్తవులను జగన్ ఎలా ఆకట్టుకున్నది.. ఎలా వారికి ఉచితాలు అందించింది.. తద్వారా వారి నుంచి ఎటువంటి ప్రయోజనాలు పొందింది.. ఇలా అన్ని విషయాలను రాధాకృష్ణ బయటకు చెప్పేశారు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కూడా దళిత క్రైస్తవ పాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా వారికి ప్రభుత్వం తరఫున కానుకలు కూడా ఇస్తుంది. అలాంటప్పుడు జగన్ చేసింది తప్పు ఎలా అవుతుంది.. ఒకవేళ చంద్రబాబు చేసింది రైట్ అయితే.. జగన్ చేసింది కూడా రైటే కదా.. అలాంటప్పుడు రాధాకృష్ణ ఎలా విమర్శిస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే చంద్రబాబు విషయంలో పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యే రాధాకృష్ణ.. జగన్ విషయంలో మాత్రం అడ్డగోలుగా రాస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.