Homeఆంధ్రప్రదేశ్‌CM YS Jagan : బాబాయ్, అబ్బాయ్ లను తెగ్గొట్టే పనిలో జగన్

CM YS Jagan : బాబాయ్, అబ్బాయ్ లను తెగ్గొట్టే పనిలో జగన్

CM YS Jagan : గత ఎన్నికల్లో అంతులేని విజయం దక్కినా జగన్ కు ఒక అసంతృప్తి మిగిలిపోయింది. అదే శ్రీకాకుళంలో కింజరాపు కుటుంబం ఆధిపత్యం. శ్రీకాకుళం ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు, టెక్కలి ఎమ్మెల్యేగా కింజరాపు అచ్చెన్నాయుడులు గెలుపొందారు. అంతటి ప్రభంజనంలో సైతం ఇద్దరూ నిలబడ్డారు. శ్రీకాకుళం జిల్లాపై తమకున్న పట్టును నిలబెట్టుకున్నారు. ఇది జగన్ కు ఏమాత్రం మింగుడుపడని అంశంగా మారిపోయింది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కింజరాపు కుటుంబానికి గట్టి దెబ్బ కొట్టాలన్న ప్రయత్నంలో జగన్ ఉన్నారు.

అక్రమాస్తులు, అవినీతి కేసుల్లో జగన్ ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. అయితే  ఈ కేసులో స్వయంగా కింజరాపు ఎర్రన్నాయుడు ఇంప్లీట్ అయ్యారు. స్వయంగా కోర్టులో పిటీషన్లు కూడా వేశారు. అప్పటి నుంచే ఎర్రన్నాయుడు అంటే జగన్ కు కోపం ఉంది. ఎర్రన్న అకాల మరణంతో ఆ కోపం కుటుంబసభ్యులపై కన్వెర్టు అయ్యింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అచ్చెన్నాయుడును టార్గెట్ చేసుకున్నారు. మంత్రిగా ఉండేటప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారంటూ అభియోగాలు మోపారు. అరెస్టులతో అచ్చెన్నకు చుక్కలు చూపించారు.

ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బాబాయ్, అబ్బాయ్ ను మట్టి కరిపించే నాయకుల కోసం జగన్ రంధ్రాన్వేషణ చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం ఎంపీ క్యాండిడేట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ సమయంలోనే ఓ డాక్టర్ జగన్ కి తారసపడినట్టు తెలుస్తోంది. బలమైన సామాజిక నేపథ్యం, ఆపై వృత్తిరీత్యా డాక్టర్ కావడం, ఆర్థికంగా మంచి రేంజ్ లో ఉండడంతో ఆయన్నే డిసైడ్ చేసినట్టు తెలుస్తోంది. ఆయనే డాక్టర్ దానేటి శ్రీధర్. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు స్వయాన తోడల్లుడు. అన్నివిధాలా కింజరాపు కుటుంబానికి సమజోడి కావడంతో జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అన్నీ కుదిరితే ఆయనే వైసీపీ క్యాండిడేట్ అని వైసీపీ వర్గాలు సైతం చెబుతున్నాయి.

ఇప్పటికే అచ్చెన్నాయుడిపై క్యాండిడేట్ ను ఫిక్స్ చేశారు. దూకుడు స్వభావమున్న దువ్వాడ శ్రీనివాస్ ను ఎంపిక చేశారు. టెక్కలిలో ఢీ అంటే ఢీ అని సౌండ్ చేసే దువ్వాడను సీఎం జగన్ అన్నివిధాలా ప్రోత్సహించారు. ఎమ్మెల్సీగా చేసి అచ్చెన్నను ఢీకొట్టాలని పురమాయించారు. అయితే ఆయన పవర్ అనుభవిస్తున్నారు.. సౌండ్ చేస్తున్నారు.. కానీ ప్రజలను ఆకర్షించలేకపోతున్నారు. చివరకు సొంత పార్టీ నేతలను సైతం ఆకట్టుకోలేకపోతున్నారు. దీంతో ఆయన్ను తప్పించి భార్య దువ్వాడ వాణి క్యాండిడేట్ అయితే ఎలా ఉంటుందోనన్న చర్చ అయితే నడుస్తోంది. అయితే ఈ తరుణంలో అదే కుటుంబానికి చెందిన దానేటి శ్రీధర్ ఎంపీ క్యాండిడేట్ గా ఎంతవరకు రాణిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version