YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy) తాడేపల్లి ప్యాలెస్ కు రాలేదా? బెంగళూరు కే పరిమితం అయ్యారా? ఈ ప్రచారంలో నిజం ఎంత? ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరుకి పరిమితం అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అయితే వారంలో మూడు రోజులపాటు తాడేపల్లి లో ఉంటూ.. మరో నాలుగు రోజులు మాత్రం బెంగళూరులో ఎక్కువగా గడుపుతున్నారు. అయితే మద్యం కుంభకోణం నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జాడలేదు. ఈవారం తాడేపల్లి ప్యాలెస్ కు ముఖం చాటేసినట్లు ప్రచారం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగా తాడేపల్లిలో ఎటువంటి సందడి కూడా లేదు. మద్యం కుంభకోణం కేసులు జగన్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన బెంగళూరుకే పరిమితం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: రాజకీయ త్రాసులో జగన్.. మొగ్గు ఎటువైపో?
అప్పట్లో తాడేపల్లి దాటని వైనం..
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లపాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన తాడేపల్లిలో భారీ ప్యాలెస్ నిర్మించుకున్నారు. అయితే సీఎంగా ఉన్నప్పుడు అదే ప్యాలెస్ ను కార్యాలయంగా మార్చుకున్నారు. పైగా ఆ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చింది తక్కువ. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సరిగ్గా ఎన్నికలకు ఏడాదిన్నర ముందు జిల్లాల పర్యటనకు సిద్ధపడ్డారు. సంక్షేమ పథకాలను ప్రారంభించే సమయంలో తాడేపల్లి పాలెస్ నుంచి బయటకు వచ్చేవారు. అయితే అలా వచ్చే క్రమంలో ఆకాశమార్గంలో ఎక్కువగా ప్రయాణించే వారన్న విమర్శ ఉంది. దానిని పక్కన పెడితే అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి తీరులో స్పష్టమైన మార్పు కనిపించింది. అప్పటివరకు తాడేపల్లిలో ఎక్కువగా గడిపే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లడం ప్రారంభించారు. బెంగళూరులో సువిశాలమైన యలహంక ప్యాలెస్ ఆయనకు ఉంది. అక్కడే నిత్యం సమీక్షలు, సమావేశాలు జరుపుకుంటారు జగన్మోహన్ రెడ్డి.
వారంలో మూడు రోజులపాటు..
ఎన్నికల ఫలితాల తరువాత.. ప్రతి మంగళవారం సాయంత్రం తాడేపల్లికి( Tadepalli ) వచ్చేవారు. మూడు రోజులపాటు ఆ ప్యాలెస్ లో ఉండి తిరిగి బెంగళూరు వెళ్ళిపోయేవారు. గత కొద్ది నెలలుగా ఇదే జరుగుతోంది. కానీ ఈ వారం తాడేపల్లి పాలస్ వైపు జగన్ చూడలేదు. అసలు బెంగళూరు నుంచి బయటకు అడుగుపెట్టలేదు. వాస్తవానికి బెంగళూరులో ఉన్న యెలహంక ప్యాలెస్ ఆస్తి ఒప్పందంలో భాగంగా షర్మిల కు కేటాయించినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. అయితే ప్రస్తుతం షర్మిల హైదరాబాదులోని లోటాస్ పాండ్ లో ఉంటున్నారు. దీంతో హైదరాబాద్ వైపు జగన్మోహన్ రెడ్డి అసలు చూడడం లేదు. అందుకే ఎక్కువగా ఇప్పుడు బెంగళూరులో గడుపుతున్నారు. తాడేపల్లి వచ్చి రివ్యూలు జరుపుతున్నారు. పార్టీ కీలక నేతలంతా అక్కడే జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు. అయితే వారంలో విధిగా మూడు రోజులపాటు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటూ పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసేవారు. కానీ ఈ వారం ఇక్కడికి రాకపోవడం మాత్రం చర్చకు దారితీస్తోంది.
Also Read: స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఔట్.. ప్రక్షాళన దిశగా చంద్రబాబు!
లాబీయింగ్ కోసమే..
మద్యం కుంభకోణం( liquor scam ) కేసు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దాదాపు ఈ కేసు తుది దశకు వచ్చింది. రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ తో పతాక స్థాయికి చేరింది. తరువాత అరెస్టు జగన్మోహన్ రెడ్డి దేనని ప్రచారం నడుస్తోంది. అందుకే ఢిల్లీ స్థాయి లాబీయింగ్ చేసేందుకు ఆయన బెంగుళూరులో ఉండిపోయారన్న ప్రచారం అయితే మాత్రం జోరుగా నడుస్తోంది. ఢిల్లీ నుంచి మాత్రం సరైన సహకారం లేకుంటే మాత్రం ఆయన తాడేపల్లికి వచ్చి మద్యం కుంభకోణం పై ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.