Yoga Record Visakhapatnam: అంతర్జాతీయ యోగా దినోత్సవం( International yoga day ) సందర్భంగా ఏపీవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. విశాఖలో ప్రపంచ యోగా డే విజయవంతం అయింది. అల్లూరి జిల్లాకు చెందిన 26,835 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి ప్రతాప్ రావు జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. యోగా గురువు శ్రీనివాస్ విద్యార్థుల చేత ఆసనాలు వేయించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధుల పర్యవేక్షణలో ఇది జరిగింది. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో గిరిజన విద్యార్థుల సూర్య నమస్కారాలు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ కార్యక్రమం. ఏకంగా 27 వేల మంది విద్యార్థులతో యోగాసనాలు వేయించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read: International Yoga Day 2025: యోగా డే : మోడీ, చంద్రబాబు యోగాసనాలు హైలెట్
ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో
ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. అందులో భాగంగా అల్లూరి జిల్లా ( Alluri district) మన్యం నుంచి 26,835 మంది విద్యార్థులు విశాఖ నగరానికి చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణానికి 106 పాఠశాలల నుంచి వేల మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి వచ్చారు. సూర్య నమస్కారాలు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు. రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్, ఇతర మంత్రులు సైతం హాజరయ్యారు. యోగా గురువు శ్రీనివాస్ విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేయించారు. నారా లోకేష్ సైతం యోగాసనాలు వేసి విద్యార్థుల్లో జోష్ నింపారు.
Glimpses of Maha Surya Namaskar
, united in perfect harmony, breaking barriers & setting new benchmarks yesterday at Engineering Campus in Andhra University, Vizag ! #IDY2025 #YogaForOneEarthOneHealth #InternationalDayofYoga2025 pic.twitter.com/dqPl7l5iTu
— PIB in Telangana (@PIBHyderabad) June 21, 2025
విద్యార్థులకు క్యూఆర్ కోడ్
సూర్య నమస్కారాలతో( Surya Namaskar ) పాటు యోగాసనాలు వేయడానికి వచ్చిన విద్యార్థులకు ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి భుజానికి దీన్ని తగిలించారు. యోగాంధ్ర కార్యక్రమం కోసం వచ్చిన విద్యార్థుల వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కూడా కేటాయించారు. విద్యార్థులంతా యూనిఫాంలో పాల్గొనడం విశేషం. విద్యార్థులు సూర్య నమస్కారాలు చేయగా ప్రపంచ గిన్నిస్ రికార్డుల కన్సల్టెంట్ నిశ్చల్ బరోత్ తో పాటు 42 మంది సభ్యులు పర్యవేక్షించారు. శుక్రవారం మధ్యాహ్నం వేదిక వద్దకు చేరుకున్నారు. భోజనాల అనంతరం విద్యార్థులు ఆసనాలు ప్రారంభించారు. ఒకే క్రమంలో అన్ని బ్లాక్లలో విద్యార్థులు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.