https://oktelugu.com/

Dharmana Prasada Rao: వైసిపి వర్సెస్ ఆ సీనియర్ నేత.. పొలిటికల్ గేమ్!

ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత ఆప్తుడు. ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లో రాణించారు. కానీ ఇప్పుడు జగన్ పార్టీలోనే ఉన్నారు. కానీ పొలిటికల్ డిఫెన్స్ లో కొనసాగుతున్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : December 6, 2024 / 10:05 AM IST

    Dharmana Prasada Rao

    Follow us on

    Dharmana Prasada Rao: వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు మౌనం వీడుతారా? పార్టీలోనే కొనసాగుతారా? లేకుంటే బయటకు వెళతారా? పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చగా నడుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ధర్మాన మౌనంగా ఉన్నారు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. కనీసం రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు సైతం ముఖం చాటేస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన ఈ కార్యక్రమాల్లోనూ పాలుపంచుకోవడం లేదు. మరోవైపు జగన్ ప్రజల్లోకి వచ్చేందుకు నిర్ణయించారు. జిల్లాల వారీగా రివ్యూలు జరుపుతున్నారు. అందులో భాగంగా కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు,చేర్పులు చేస్తున్నారు.శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి ధర్మాన ప్రసాదరావు పరిస్థితి ఏంటి అని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి తో ఫోన్ చేయించారు. పార్టీలో యాక్టివ్ కావాలని కోరారు. మరో అభిప్రాయం ఉంటే చెప్పాలని.. మీ సూచనతోనే కొత్త ఇన్చార్జిని సైతం నియమిస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే తనకు కొంత సమయం కావాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అంతా తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చారు. రివ్యూ కు హాజరయ్యారు. కానీ ధర్మాన ప్రసాదరావు గైర్హాజరయ్యారు. దీంతో ఆయన పార్టీలో కొనసాగలేనన్న సంకేతం పంపించారు.

    * సిద్ధంగా లేకపోయినా
    ధర్మాన ప్రసాదరావును వదులుకోవడానికి వైసిపి సిద్ధంగా లేదు. కానీ ధర్మాన మాత్రం కొనసాగడానికి ఇష్టపడడం లేదు. పార్టీ తనకు పట్టించుకోకుండా కొత్త ఇన్చార్జి నియమిస్తే.. తాను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని ధర్మాన భావిస్తున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ కాకూడదు.అలాగని వైసీపీలో కొనసాగితే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. పోనీ వైసీపీలో కొనసాగినా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో ఎటువంటి మార్పు కనిపించదు. పైగా జిల్లాలో వైసీపీ నాయకత్వానికి తావులేదు. ఇతర నియోజకవర్గాల్లో వేలు పెట్టడానికి వీలుపడదు.ఈ పరిణామాల క్రమంలో వైసీపీకి దూరంగా ఉండటమే మేలన్న నిర్ణయానికి ధర్మాన వచ్చినట్లు తెలుస్తోంది.

    * సమీక్షకు డుమ్మా
    శ్రీకాకుళం అసెంబ్లీ వైసీపీ ఇన్చార్జి పదవిని ధర్మాన ప్రసాదరావుకి ఇవ్వాలని వైసిపి భావిస్తోంది. కానీ ధర్మాన వైసీపీలో ఉంటారా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్షకు ఆయన డుమ్మా కొట్టారు. అయితే తాను పార్టీలో కొనసాగలేనని ధర్మాన తన నోటి వెంట మాటంటే తాము నిర్ణయం తీసుకుంటామన్న ఆలోచనలో వైసిపి నాయకత్వం ఉంది. అయితే పార్టీ తలను పక్కన పెడితే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న ఆలోచనలు ధర్మాన ఉన్నారు. అయితే ముందుగా పార్టీ నిర్ణయం తీసుకుంటుందా? ధర్మాన ప్రసాదరావు నిర్ణయం తీసుకుంటారా? అన్నది హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇద్దరిలో ఒకరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి దాపురించింది. జనవరి మూడో వారం నుంచి ప్రజల్లోకి రావాలని జగన్ భావిస్తున్నారు. కచ్చితంగా ఆయన శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారు. అప్పటిలోగా శ్రీకాకుళం అసెంబ్లీ ఇన్చార్జి పదవి విషయం తేల్చేయాలని భావిస్తున్నారు. ధర్మాన అభిప్రాయాన్ని కనుక్కొని ఒక నిర్ణయానికి రానున్నారు. కానీ కొంత సమయం కావాలని ధర్మాన అడగడం వెనుక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.