Pushpa 2 : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే… ఇక మీదట కూడా చాలా మంది హీరోలు పాన్ ఇండియా హీరోలుగా దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీ విని ఎరుగని రీతిలో ‘పుష్ప 2’ సినిమా భారీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక అల్లు అర్జున్ లాంటి నటుడు ఈ సినిమాతో తన పూర్తిస్థాయి నటనను బయటకు తీయడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరిని ఆకట్టుకుంటున్నాడు. ఇక తన నట విశ్వరూపంతో తన అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా ఉర్రూతలుగిస్తున్న ఈ నటుడు సూపర్ సక్సెస్ సాధించే దిశగా ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తలు తీసుకొని మరి తన క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించాడు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ఈ సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని కూడా తీసుకొచ్చి పెట్టిందనే చెప్పాలి. ఊర మాస్ సినిమాలకు తను కేరాఫ్ అడ్రస్ గా మారినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏదిఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని ఎలాబోతున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక పుష్ప 2 ద రూల్ తో వచ్చిన ఆయన ఆ తర్వాత పుష్ప 3 రాంపేజ్ మీద కూడా ప్రతి ఒక్కరికి చాలా అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉంటే పుష్ప 2 క్లైమాక్స్ లో ఒక వ్యక్తి పుష్ప వాళ్ళు ఉన్న ఇంట్లో బాంబు పేల్చుతాడు. ఆ వ్యక్తి ఎవరు అంటు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలైతే జరుగుతున్నాయి.
అయితే ఫేస్ కనబడకుండా వచ్చిన ఆ వ్యక్తి కొండారెడ్డి తమ్ముడు అయిన జాల్ రెడ్డి గా తెలుస్తోంది… ఇక పుష్ప 2 లో జాలిరెడ్డి పాత్ర ఏమీ లేకపోయిన పుష్ప 3 కోసం అతన్ని ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తోంది. అందుకే పుష్ప 2 చివర్లో జగపతిబాబు తమ్ముడి కొడుకు చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్లి నివాళులు అర్పించిన జాల్ రెడ్డి అక్కడి నుంచి పుష్ప వాళ్ళు ఉన్న ఇంట్లో బాంబును పేల్చినట్టుగా కూడా సమాచారమైతే అందుతుంది.
మరి మొత్తానికైతే పుష్ప 3 లో జాల్ రెడ్డి క్యారెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక అలాగే జగపతిబాబు కూడా పుష్ప 3 కోసం విలనిజాన్ని పండించడానికి రెడీ అవుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి…
ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 3 మీద కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి సుకుమార్ ఆ సినిమాని ఎప్పుడు తెరమీదకి తీసుకొస్తాడనే దానిమీద స్పష్టత లేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ ని సాధించబోతుందనే విషయాలు మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి…