Homeఆంధ్రప్రదేశ్‌YCP: వైసిపి కఠిన నిర్ణయం

YCP: వైసిపి కఠిన నిర్ణయం

YCP: ఏపీలో( Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నగర మొదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సైతం సన్నాహాలు మొదలెట్టేసారు. ఫోటోతో కూడిన ఓటరు జాబితాను మార్చి 9న ప్రదర్శించనున్నారు. ముందుగా పంచాయితీ ఎన్నికలు.. తరువాత మున్సిపల్ ఎన్నికలు.. చివరిగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుత ఎన్నికల ప్రధాన అధికారి నీలం సాహ్ని మార్చి 31న పదవీ విరమణ చేయనున్నారు. కొత్త అధికారి నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఎన్నికల కోసమే ఈ నిర్ణయం అన్నట్లు ఉంది. వేసవిలోనే స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది.

* ఆ పరిస్థితి ఊహించిందే..
అయితే కూటమి దూకుడుగా ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటనేది తెలియడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ క్షేత్రస్థాయిలో మాత్రం సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ మెజారిటీ నియోజకవర్గాల్లో నాయకత్వం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. పైగా తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించింది. అయితే ఇక్కడ మూడు పార్టీల సమూహం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సైతం ఇక్కడ మద్దతుగా ఉంది. దీంతో ఫలితాలు ఏకపక్షంగానే రానున్నాయి. ఈ విషయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియంది కాదు. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో 80 శాతం స్థానిక సంస్థలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా కూటమి తమలాగే ప్రయత్నిస్తుంది అని వైసిపికి స్పష్టమైన అవగాహన ఉంది.

* కూటమి ప్రభుత్వ ఆలోచన..
స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరగని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించి ముందుకెళ్లాలన్నది కూటమి ఆలోచన. అందుకే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని నియమించే పనిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వెంటనే ఎన్నికలకు వెళ్లి వేసవిలోనే స్థానిక సంస్థలను భర్తీ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. అయితే బీసీ గణనతో పాటు రిజర్వేషన్లు వంటి అంశాలను పట్టుకొని కోర్టుకు వెళ్లాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. అయితే వైసిపి అధికారంలో ఉన్నప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలన్న ఆలోచనతో కోర్టుకు వెళ్ళింది. అప్పుడే సక్సెస్ కాలేదు.. ఇప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలి. అయితే పరిస్థితులు శృతిమించితే మాత్రం ఏదో ఒక కారణం చెప్పి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించడం ఖాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular