https://oktelugu.com/

YCP Social Media: వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు అక్కడి నుంచే జీతాలు

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కోసం వేలాది మంది సోషల్ మీడియా ప్రతినిధులు పనిచేశారు.వారికి జీతాలు కూడా చెల్లిస్తూ వచ్చారు.అయితే ఆ జీతాలు వైసిపి ఇవ్వడం లేదు. గత ఐదేళ్లగా వైసిపి ప్రభుత్వం చెల్లించినట్లు తాజాగా తేలింది.

Written By:
  • Dharma
  • , Updated On : November 12, 2024 10:56 am
    YCP Social Media

    YCP Social Media

    Follow us on

    YCP Social Media: ఏపీ వ్యాప్తంగా వైసిపి సోషల్ మీడియా ప్రతినిధులపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు వందలాదిమందిపై ఈ కేసులు నమోదు చేస్తున్నారు ఏపీ పోలీసులు. అదే సమయంలో అరెస్టులు సైతం కొనసాగుతున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో క్రియాశీలకంగా వ్యవహరించిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఇంకోవైపు వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జిగా ఉన్న సజ్జల భార్గవరెడ్డి,రాష్ట్రస్థాయిలో కీలకంగా వ్యవహరించిన అర్జున్ రెడ్డిలపై సైతం కేసులు నమోదు చేశారు. ఇంకోవైపు సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా పోస్టులు పెట్టిన రామ్ గోపాల్ వర్మపై సైతం కేసు నమోదు అయ్యింది. అయితే వీరంతా వైసిపిపై, అధినేత జగన్ పై అభిమానంతో పనిచేసినవారు అని ఇప్పటివరకు భావించారు. సోషల్ మీడియా విభాగం కొద్దిపాటి జీవితాలు అందించేదని అంతా అనుకున్నారు. కానీఆసక్తికర విషయం ఒకటి బయటపడింది.వీరందరికీ ప్రభుత్వమే జీతాలు చెల్లించినట్లు తేలింది.ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఈ జీతాలు విడుదలైనట్లు తెలుస్తోంది.వర్రా రవీందర్ రెడ్డి విచారణలో ఈ విషయం స్పష్టమైనట్లు సమాచారం.

    * వైసిపి హయాంలో ఏర్పాటు
    వైసిపి ప్రభుత్వ హయాంలో ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం చేపట్టే మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లడం దీని ఉద్దేశం. కానీరాష్ట్రవ్యాప్తంగా వైసిపి కోసం పనిచేసిన సోషల్ మీడియా ప్రతినిధులకు భారీ మొత్తంలో జీతాలు ఈ కార్పొరేషన్ నుంచి చెల్లించినట్లు పోలీస్ విచారణలో తేలింది.విపక్ష నేతలు,వారి కుటుంబ సభ్యులు,హైకోర్టు,సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టే వారిని, వివిధ ప్రాంతాల్లో ఉంటూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారికి డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు చెల్లించి మరియు ప్రోత్సహించినట్లు పోలీస్ దర్యాప్తులో తేలింది.

    * రవీందర్ రెడ్డి విచారణలో తేలింది
    కడపలో తప్పించుకున్నారు వర్రా రవీందర్ రెడ్డి.తెలంగాణలో తిరిగి పట్టుబడ్డారు.ఆయన విచారణలో ఈ విషయం బయటకు వచ్చినట్లు సమాచారం.ఇదే విషయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ వెల్లడించారు. వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకున్నట్లు తేలిందన్నారు.ఒక్క రవీందర్ రెడ్డికే కాదు రాష్ట్రవ్యాప్తంగా వైసిపి సోషల్ మీడియాలో పనిచేసిన వారందరికీ.. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలు అందినట్లు పోలీస్ శాఖ ఒక నిర్ణయానికి వచ్చింది. దీనిపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. సమగ్ర వివరాలు సేకరించి ప్రభుత్వం బయటపెట్టే అవకాశం ఉంది.