YCP Seniors: రాజకీయాలు( politics) ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేనివే రాజకీయాలు. అందుకే లోతుగా ఆలోచించి రాజకీయాలు చేయాలంటారు పెద్దలు. కానీ ఏపీలో జగన్మోహన్ రెడ్డి ది ఒక తరహా రాజకీయం. చంద్రబాబుది మరో తరహా రాజకీయం. పవన్ కళ్యాణ్ శైలి వేరు. అయితే జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఒకలా ఉంటుంది. చంద్రబాబు వ్యూహం మరోలా ఉంటుంది. అయితే ఎవరి స్టైల్ వారిదే. అంతిమంగా పార్టీ బాగుండాలి. తమ నాయకత్వం చేజారకూడదు. తక్కువ మందితోనైనా చివరి వరకు రాజకీయం చేయడమే నిజమైన నాయకత్వ లక్షణం. ఈ విషయంలో చంద్రబాబుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో సీనియర్లు కొందరు బయటకు వెళ్లిపోయారు. జగన్మోహన్ రెడ్డి దూకుడుతో చాలామంది సీనియర్లు పార్టీకి గుడ్ బై చెప్పారు. అయినా సరే పార్టీని సమర్థవంతంగా నడపగలిగారు చంద్రబాబు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైతం అదే వ్యూహంతో ముందుకు వెళ్లారు. పార్టీలో చేరికలకు అడ్డుకట్ట వేశారు. ఎలా అంటే చాలామంది నేతలతో బూతులు మాట్లాడించారు. వారంతా తప్పనిసరిగా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాల్సిందే.
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో బూతులు తిట్టని నేతలు లేరు. అయితే అప్పట్లో హుందాగా వ్యవహరించిన వారు ఎంచక్కా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసారు. కానీ బూతులు మాట్లాడిన నేతలు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అలాగని గతంలో మాదిరిగా బూతులు మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే రెడ్ బుక్ రూపంలో కేసులతోపాటు అరెస్టులు కూడా జరుగుతున్నాయి. అందుకే బూతులు మాట్లాడడం లేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ కావడం లేదు. యాక్టివ్ కావాల్సిందేనని అధినేత జగన్మోహన్ రెడ్డి చెబుతున్న ఆదేశాలు పాటించడం లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వస్తున్న స్క్రిప్ట్ పై కూడా మాట్లాడడం లేదు.
* వారంతా ఉండాల్సిందే..
పేర్ని నాని( Nani), కొడాలి నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, అప్పలరాజు.. ఇలా ఈ నేతలంతా తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సిందే. మరో పార్టీ ఆప్షన్ లేదు కూడా. అయితే వారు విధేయతతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం లేదు. అలా వారికి లాక్ చేశారు జగన్ మోహన్ రెడ్డి. సజ్జల ద్వారా బూతుల స్క్రిప్టులు ఇప్పించి.. వారితో మాట్లాడించి.. ప్రత్యర్థి పార్టీల్లో చేరకుండా ముందుగానే కట్టడి చేశారు. అయితే ఇప్పుడు బూతులు అంటేనే ఈ నేతలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రెస్ మీట్ లు పెట్టడం లేదు. నియోజకవర్గాల్లో పర్యటించడం లేదు. పొడి పొడిగానే మాట్లాడుతున్నారు. అన్నింటికీ మించి కూటమి పార్టీల నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే చేరిపోయేందుకు కూడా సిద్ధపడుతున్నారు. కానీ కూటమి పార్టీలు ఆహ్వానించే సాహసం చేయడం లేదు.
* కారణాల కోసం ఎదురుచూపు..
అయితే ఏదో ఒక వంక దొరకాలి సీనియర్ నేతలకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యాక్టివ్ కాలేరు. నియోజకవర్గాల్లో యాక్టివ్ రాజకీయాలు చేయలేరు. ఏదైనా కారణంతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైల్లోకి వెళ్లిన.. కోర్టుల నుంచి కీలక ఆదేశాలు వచ్చినా.. వాటిని సాకుగా చూపి అధినేతకు దూరం కావాలన్న వారు కూడా ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అదును కోసం ఎదురుచూస్తున్నారన్నమాట. ఆయనతో ఉండి కేసుల బాధతో ఉండే కంటే.. సైలెంట్ గా ఉండడమే మేలన్న సీనియర్లు ఉన్నారు. అయితే నియోజకవర్గం ఆదేశాలు ఇచ్చినా పెడచెవిన పెడుతున్న వారు ఉన్నారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి తమపై సీరియస్ యాక్షన్‌కు దిగితే.. పార్టీ నుంచి గౌరవంగా తప్పుకోవాలనుకున్నవారు ఉన్నారు. ఇలా ఎటు చూసినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముద్ర చెరిపేయాలనుకున్న వారే అధికం.