https://oktelugu.com/

YCP Seniors : కాంగ్రెస్ వైపు చూస్తున్న వైసీపీ సీనియర్లు?

YCP Seniors ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది వైసీపీ నేతలు పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లడం ఖాయంగా తెలుస్తోంది.

Written By:
  • NARESH
  • , Updated On : June 18, 2024 / 03:23 PM IST

    YCP seniors

    Follow us on

    YCP Seniors : కాంగ్రెస్ పార్టీ ఏపీపై దృష్టి పెట్టిందా? వైసిపి ఘోర పరాజయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోనుందా? వైసీపీ కీలక నాయకులను కాంగ్రెస్ లో చేర్చుకోనుందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ జాబితాలో చాలామంది సీనియర్లు సైతం ఉన్నట్లు సమాచారం. 2029 నాటికి కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా మారుతుందని.. జాతీయ స్థాయిలో సైతం ఆ పార్టీ బలం పెంచుకుంటుందన్న సంకేతాలు నేపథ్యంలో.. ఏపీలో వైసీపీ నేతలు కాంగ్రెస్ లోకి వెళతారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్నది సీనియర్ కాంగ్రెస్ నాయకులే. కానీ అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం తక్కువ. ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇన్ని రోజులు వారంతా వైసీపీలో ఉండాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు వైసీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అదే సమయంలో జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడంతో.. మాతృ పార్టీ వైపు వైసీపీ సీనియర్లు చూస్తున్నట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చూస్తున్నారు. గత రెండు ఎన్నికల కంటే.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం పెంచుకుంది. కడప జిల్లాలో అయితే లక్షా యాభై వేలకు పైగా ఓట్లు సాధించిన షర్మిల తన మార్కును చూపించారు. కాంగ్రెస్ హై కమాండ్ ఆశలను సజీవంగా ఉంచగలిగారు. ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఓట్లను సొంతం చేసుకుంది. కడపలో కాంగ్రెస్ అభ్యర్థి ఏకంగా 25 వేల ఓట్లను సొంతం చేసుకున్నారు. దళితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం కాంగ్రెస్ కు ఆదరణ పెరిగింది. ఇదే దూకుడుతో ముందుకు పోవాలని కాంగ్రెస్ హై కమాండ్ షర్మిలకు సూచించినట్లు సమాచారం.

    వైసీపీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా రాజశేఖర్ రెడ్డికి సమకాలీకులే. కానీ రాజశేఖర్ రెడ్డి వద్ద ఉన్నంత స్వేచ్ఛ.. జగన్ వద్ద లేకుండా పోయింది. గత పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సైతం పెద్దగా ఉనికి చాటుకోకపోవడంతో సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు వైసీపీ పరిస్థితి దిగజారింది. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. ప్రస్తుతం జగన్ పై టిడిపి సర్కార్ దృష్టి సారిస్తుంది. దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తుంది. జగన్ మరింత ఇబ్బందులు పడటం ఖాయం. ఏపీ ప్రజల్లో జగన్ ఒక ఫెయిల్యూర్ నాయకుడిగా చూపించేందుకు తప్పకుండా ప్రయత్నిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది వైసీపీ నేతలు పూర్వాశ్రమం కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లడం ఖాయంగా తెలుస్తోంది.