YCP leaders: ఏపీలో( Andhra Pradesh) విచిత్ర రాజకీయాలు నడుస్తున్నాయి. కూటమి 17 నెలల పాలన పూర్తి చేసుకుంది. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో దూసుకుపోతోంది. అమరావతి రాజధాని నిర్మాణం చేపడుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. మరోవైపు విశాఖకు భారీ ఐటి సంస్థలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం పరిశ్రమలను ఏర్పాటు చేస్తోంది. అయితే ఏ చిన్న లోపం వెలుగు చూసినా దానిని హైలెట్ చేస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రజా పోరాటాలకు దూరంగా.. ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారానికి దగ్గరగా ఉంటుంది ఆ పార్టీ. అయితే ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం. ప్రజలకు ఇట్టే నిజాలు తెలిసిపోతున్నాయి. ఇటువంటి సమయంలో స్ట్రాటజీలు మార్చాలి. కానీ వైసీపీ పాత చింతకాయ వాసన మాదిరిగా.. అదే ధోరణితో ముందుకు సాగుతోంది. అయితే ఇప్పుడు అరెస్టులు అంటూ గగ్గోలు పెడుతోంది. ఒకసారి అరెస్టుల తీరు చూస్తుంటే ఇట్టే అర్థం అవుతుంది. ధర్మాన ప్రసాదరావు జోలికి వెళ్లారా? బొత్స సత్యనారాయణ పై కేసులు నమోదు చేశారా? ఒకసారి కేసుల నమోదు.. అరెస్టులు జరుగుతున్న నేతల ట్రాక్ రికార్డును చూస్తే ఇట్టే అర్థమయిపోతుంది.
పాత కేసులను కాదని..
తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ( Jogi Ramesh)అరెస్ట్ అయ్యారు. కల్తీ మద్యం కేసులో ఆయనను అరెస్టు చేశారు. వాస్తవానికి జోగి రమేష్ పై నమోదు చేసేందుకు చాలా కేసులు ఉన్నాయి. అరెస్టు చేసేందుకు అవసరమైన ఆధారాలు కూడా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రం తో పాటు నవ్యాంధ్రప్రదేశ్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు. సీనియర్ మోస్ట్ లీడర్ కూడా.
అటువంటి వ్యక్తి
ఇంటిపై దాడికి ప్రయత్నించారు జోగి రమేష్. అప్పట్లో అది సంచలనమే. టిడిపి శ్రేణులు రక్తం మరిగింది. అధికార మదంతో నాడు జోగి రమేష్ ఆ ప్రయత్నం చేశారు. దానికి ఏం చేయాలి? అధికారంలోకి వచ్చిన వెంటనే జోగి రమేష్ ను అరెస్టు చేయాలి. ఆ ఛాన్స్ వచ్చింది కూడా.. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. అయితే ప్రభుత్వం ఇదే ఉదాసీనతతో ఉంటుందని భావించిన జోగి రమేష్.. కల్తీ మద్యంతో చెడ్డ పేరు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. అలా ప్రయత్నం చేసే క్రమంలో ప్రధాన నిందితుడే తమను జోగి రమేష్ ప్రోత్సహించాడని బయట పెట్టేశారు. అంటే ఇప్పుడు అరెస్టు జరిగింది కొత్త కేసులో మాత్రమే. పాత కేసులను తిరగ దోడలేదు. కేవలం కొత్త కేసులో మాత్రమే జోగి రమేష్ ను అరెస్టు చేశారు.
బెదిరించిన వంశీ మోహన్..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ( Vamsi Mohan ) విషయంలో కూడా అలానే జరిగింది. ఆయన దూకుడు తనం తెలియంది కాదు. పద్ధతి లేకుండా మాట్లాడేవారు. చంద్రబాబు వయసు లెక్క చేయకుండా నూటికి ఎంత వస్తే అంత మాట అనేవారు. సాక్షాత్ అసెంబ్లీలోనే చంద్రబాబు సతీమణి గురించి నీచంగా మాట్లాడారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే వల్లభనేని వంశీ మోహన్ జోలికి పోలేదు ప్రభుత్వం. కానీ తన పాత తప్పులు ఎక్కడ బయట పడతాయో.. అని కొత్త తప్పులు చేశారు వల్లభనేని వంశీ మోహన్. ఏకంగా టిడిపి కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని బెదిరించారు. ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నారు. అలా ప్రభుత్వాన్ని కెలికి ఇబ్బందులు తెచ్చుకున్నారు. అంటే ప్రభుత్వం వారి జోలికి వెళ్లలేదు. ప్రభుత్వం జోలికి వారు వచ్చారన్నమాట.
Also Read: లోకేష్ గోల్డెన్ లెగ్.. ఈసారి నిరూపించుకున్నారు
సేఫ్ జోన్ లో సీనియర్లు..
వైసీపీ హయాంలో సీనియర్ మంత్రులుగా ఉన్న చాలామంది ఇప్పుడు సేఫ్ జోన్ లో ఉన్నారు. ఎందుకంటే వారు రాజకీయాల్లో తమ కోసం తాము పని చేశారు. కానీ దూకుడు కలిగిన నేతల మనస్తత్వాన్ని గ్రహించారు జగన్. తన రాజకీయం కోసం వారిని పావులుగా వాడుకున్నారు. అయితే ఇప్పుడు వారే మూల్యం చెల్లించుకుంటున్నారు. తమపై వస్తున్న కొత్త కేసులతోనే తాము లోపల కు వెళ్లడం ఖాయమన్న వారు సైలెంట్ అవుతున్నారు. ఈ విషయంలో కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు చాలా జాగ్రత్త పడ్డారు. అవసరమైన మాటలను మాత్రమే ఆడుతున్నారు. చర్యలకు దిగడం లేదు కూడా..