YCP leader Tribal youth attacked: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ శ్రేణుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఆ పార్టీ నేతల దూకుడుకు అడ్డుకట్ట పడకపోతోంది. తిరుపతిలో ఓ షాపు కాంట్రాక్టు కోసం ఓ గిరిజన యువకుడిపై దౌర్జన్యానికి దిగారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు. ఒక గదిలో బంధించి చిత్రహింసలు పెట్టారు. దారుణంగా కొట్టిన ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
Read Also: ఉచిత ప్రయాణం.. పొరపాటున ఆ బస్సులు ఎక్కితే అంతే!
షాపు వివాదం నేపథ్యంలో.. తిరుపతిలోని( Tirupati) శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న ఓ షాపు లీజు హక్కులను పవన్ అనే యువకుడు దక్కించుకున్నాడు. అయితే ఆ షాపు కాంట్రాక్టు తనకు ఇవ్వాలని గత కొద్దిరోజులుగా అనిల్ రెడ్డి వేధిస్తున్నాడు. ఈ క్రమంలో కాంట్రాక్టుకు సంబంధించిన వివాదంలో పవన్ ను అనిల్ రెడ్డితోపాటు అతని మిత్రులు బంధించారు. ఓ గదిలో పెట్టి విచక్షణారహితంగా కొట్టారు. వాటికి సంబంధించిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలు బాగా వైరల్ కావడంతో విచారణ చేపట్టారు పోలీసులు. అనిల్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు.
బాధితుడు గిరిజన యువకుడు..
బాధితుడు పవన్( Pawan) గిరిజన యువకుడు. ఆ షాపు కాంట్రాక్ట్ పొందాడు. చిత్తూరు జిల్లా పులిచర్ల మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బాధితుడు పరారీలో ఉన్నాడు. ఆయన ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనిల్ రెడ్డి పై గతంలో సైతం ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఘటన విపరీతంగా వైరల్ కావడంతో రాజకీయంగా కూడా విమర్శలు వస్తున్నాయి. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నోరు తెరవడం లేదు.
అయితే తాజాగా దెబ్బలు బాధితుడు మరో వీడియో విడుదల చేశాడు. ఈ దాడి వెనుక తన తప్పు ఉందని.. ఇందులో వైసీపీ, టీడీపీకి సంబంధం లేదని స్పష్టం చేశాడు. వైసీపీ నేతది తప్పులేదని.. తన అన్నయ్య తనను కొట్టాడని కవర్ చేశాడు. ఇందులో నిజనిజాలు ఏంటి అన్నది తెలియాల్సి ఉంది.
తిరుపతిలో వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ అనిల్ రెడ్డి దౌర్జన్యం..
(Sensitive)శ్రీనివాసం వసతి గృహం ఎదురుగా ఉన్న షాపు కాంట్రాక్ట్ తనకు రాసివ్వాలంటూ గిరిజన యువకుడిపై దాడి
ఆ యువకుడిని కొడుతుంటే వీడియో తీసిన అనిల్ రెడ్డి స్నేహితులు
నిందితుడు అనిల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న… pic.twitter.com/VIocTPJa4n
— ChotaNews App (@ChotaNewsApp) August 7, 2025