Sulurpet : జూనియర్ ఎన్టీఆర్ అభిమాని పై వైసీపీ హత్యాయత్నం..పరిస్థితి విషమం

వారి ఎదుగుదల ని ఓర్వలేక ఆరు నెలల క్రితం వైసీపీ కార్యకర్తలు వెంకటేష్ పై దాడి చేసారు. మళ్ళీ శనివారం రోజు వెంకటేష్ పై రైల్వే గేట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద సునీల్ మరియు వెంకటేష్ పై అప్పట్లో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలే మరోసారి దాడి చేసారు.ఈ ఘర్షణ లో సునీల్ కి గాయాలు అయ్యాయి. అప్పుడు వైసీపీ కార్యకర్త

Written By: Vicky, Updated On : June 18, 2023 1:35 pm
Follow us on

Sulurpet : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ పార్టీ కార్యకర్తల రౌడీయిజం తారాస్థాయికి చేరుకుంది. నిన్న మొన్నటి వరకు రాజకీయాల్లో ప్రత్యర్థులైన తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీ కార్యకర్తలపై దాడులు జరిపి హత్యలు కూడా చేయించి వీళ్ళు, ఇప్పుడు ఏకంగా సినిమా హీరోల అభిమానుల మీద కూడా దాడి చెయ్యడం ప్రారంభించారు. విషయంలోకి వెళ్తే తిరుపతి జిల్లాలోని సూళూరుపేట లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై వైసీపీ కార్యకర్తలు దాడులు జరిపారు.

సూళూరుపేట కి చెందిన అన్నదమ్ములు సునీల్ మరియు వెంకటేష్ యాదవ్ , జూనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమానులు. ఎన్టీఆర్ పేరిట రక్తదానాలు వంటివి చేస్తూ ఉంటారు. అంతే కాకుండా తెలుగు దేశం పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు.వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాల వల్ల జనాల్లో వారికి రోజు రోజుకి మంచి అభిప్రాయం ఏర్పడుతూ వచ్చింది. వారి ఎదుగుదల ని చూసి వైసీపీ కార్యకర్తల్లో అసూయ మొదలైంది.

వారి ఎదుగుదల ని ఓర్వలేక ఆరు నెలల క్రితం వైసీపీ కార్యకర్తలు వెంకటేష్ పై దాడి చేసారు. మళ్ళీ శనివారం రోజు వెంకటేష్ పై రైల్వే గేట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద సునీల్ మరియు వెంకటేష్ పై అప్పట్లో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలే మరోసారి దాడి చేసారు.ఈ ఘర్షణ లో సునీల్ కి గాయాలు అయ్యాయి. అప్పుడు వైసీపీ కార్యకర్తలు ఒక పది మంది కలిసి సునీల్ ఇంటికి వెళ్లి గొడవకి దిగారు. కత్తులు మరియు రాళ్లతో దాడి చేసారు. దీంతో వెంకటేష్ అపస్మారక స్థితిలో చేరుకున్నాడు.

ఆయనని వెంటనే సమీపం లో ఉన్న హాస్పిటల్ కి చేర్చారు స్థానికులు.  వెంకటేష్ పరిస్థితి ఇప్పుడు తీవ్రమైన విషమం గా మారింది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనని నెల్లూరు హాస్పిటల్ కి తరలించారు.మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వైసీపీ నాయకులపై సోషల్ మీడియా లో తీవ్రంగా విరుచుకుపడుతున్నారు,వాళ్లకి మద్దతుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ట్వీట్స్ వేస్తున్నారు.