Yanamala Rama Krishnudu: తెలుగుదేశం( Telugu Desam) పార్టీలోనే సీనియర్ మోస్ట్ లీడర్ యనమల రామకృష్ణుడు. తాజాగా ఆయన ఈనెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. ఎమ్మెల్సీగా రిటైర్ కానున్నారు. అయితే ఆయన కొనసాగింపు లేకుండా పోయింది. అయితే ఆయనను రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం నడుస్తోంది. మొన్న ఆ మధ్యన గవర్నర్ పోస్ట్ కు సైతం ఆయన పేరు వినిపించింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేస్తున్నారు. ఆయనతో పాటు నలుగురు రిటైర్ అవుతున్నారు. కానీ యనమలకు మాత్రం కొనసాగింపు లభించలేదు. దీనిపై రకరకాల ప్రచారం నడుస్తోంది.
* చంద్రబాబుకు విధేయుడు.. చంద్రబాబుకు( Chandrababu) అత్యంత విధేయత కలిగిన నేత యనమల రామకృష్ణుడు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు రాజకీయ ఉన్నతికి కూడా కారణం ఆయనే. 1995లో టిడిపి సంక్షోభ సమయంలో స్పీకర్ గా ఉన్నారు యనమల. ఆ సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా యనమల నిర్ణయం తీసుకోవడం వల్లే.. ఆయన సీఎం అయ్యారు. 1999లో రెండోసారి అధికారంలోకి రాగలిగారు. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని బతికించుకుంటూ వచ్చారు. నాడు స్పీకర్ గా ఉన్న యనమల సహకరించకుంటే అది సాధ్యమయ్యే పని కాదని విశ్లేషణలు ఉన్నాయి.
* ఎనలేని ప్రాధాన్యం..
కష్టకాలంలో చంద్రబాబుకు అండగా నిలిచినందుకే యనమల రామకృష్ణుడుకు( yanamala Ramakrishnudu) ఎనలేని ప్రాధాన్యం దక్కుతూ వచ్చింది. 1999 ఎన్నికల్లో టిడిపి గెలిచేసరికి యనమల రామకృష్ణుడుకు కీలక మంత్రిత్వ శాఖ దక్కింది. 2004 నుంచి 2014 వరకు టిడిపి ప్రతిపక్షానికి పరిమితం అయినా.. కీలకమైన పదవులను చంద్రబాబు యనమలకు ఇచ్చారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. కానీ ఏ సభలోను యనమల రామకృష్ణుడు సభ్యుడు కారు. అటువంటి సమయంలో మంత్రి పదవి ఇచ్చారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం యనమలకు చాన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ గా కూడా పదవీ విరమణ చేసిన తర్వాత రెన్యువల్స్ లభించలేదు.
* తుని నుంచి ప్రాతినిధ్యం..
1983 నుంచి 1999 వరకు తుని( Thuni) నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు యనమల రామకృష్ణుడు. 2004 నుంచి అక్కడ ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. అయితే తాజా ఎన్నికల్లో యనమల పక్కకు తప్పుకున్నారు. కుమార్తె దివ్యను బరిలో దించి గెలిపించుకున్నారు. అల్లుడు పుట్టా మహేష్ ఏలూరు ఎంపీగా ఉన్నారు. వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదకూరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కారణం చెప్పి ఎమ్మెల్సీ పదవికి రెన్యువల్ చేయలేదు చంద్రబాబు. అయితే యనమల వయసు దృష్ట్యా ఆయనకు రాజ్యసభ పదవి కానీ.. గవర్నర్ పోస్ట్ కానీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరి అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.