Yanamala Rama Krishnudu: తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) నేతల వైఖరిలో మార్పు వస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని ఆ పార్టీ సీనియర్ల మంచి పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు వెళుతున్నాయి. ఎన్నికలకు ముందు చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీలోకి వచ్చారు. అటువంటి వారితో ఎటువంటి ఇబ్బందులు లేవు. టిడిపి అభ్యర్థుల విజయానికి వారు కృషి చేశారు. కానీ ఎన్నికల ఫలితాల అనంతరం టిడిపిలో చేరిన వారితో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వారు అవసరాల కోసం పార్టీ మారారు. ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో టచ్ లో ఉంటున్నారు. అందుకే పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: ఆంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగులకు పవన్ కళ్యాణ్ అభయం..సంచలన ప్రకటన!
* క్యాడర్లో అసంతృప్తితో..
తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో మంచి క్యాడర్ ఉంది. దశాబ్దాలుగా అదే పార్టీలో కొనసాగుతూ చాలామంది నేతలు, కార్యకర్తలు ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నుంచి టిడిపిలో చేరిన వారు చాలా నియోజకవర్గాల్లో ఇబ్బందులు పెడుతున్నారు. విభేదాలు సృష్టిస్తున్నారు. కీలక నియోజకవర్గాల్లో టిడిపి ఎమ్మెల్యేకు, క్యాడర్ కు గ్యాప్ ఏర్పడడానికి వారే ప్రధాన కారణం. అందుకే టిడిపి నాయకత్వం చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. వైసిపి నుంచి టిడిపిలో చేరాలనుకునే వారి బ్యాక్ గ్రౌండ్ చూస్తోంది. పార్టీ చేరికల విషయంలో కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచిస్తోంది. సంబంధిత నేత వివరాలను సమగ్రంగా పరిశీలిస్తోంది.
* సీనియర్ నేత ఆదేశాలు..
తాజాగా టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ( yanamala Ramakrishnudu) పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అటువంటి వారి పనులు చేయవద్దని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. తుని అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి శ్రేణుల సమావేశం జరిగింది. ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1999 తర్వాత తుని నియోజకవర్గంలో యనమల కుటుంబం గెలిచింది. అందుకే అక్కడ లోపాలు సరిదిద్దుకొని నియోజకవర్గాన్ని పదిలం చేసుకోవాలని టిడిపి భావిస్తోంది. అందులో భాగంగానే యనమల రామకృష్ణుడు టిడిపి శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ నాయకత్వం సైతం ఈ విషయంలో అన్ని నియోజకవర్గాలకు ఈ తరహా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. చాలా నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పనులు జరుగుతున్నాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే టిడిపి నాయకత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ 13 ప్రశ్నలు