Jagan: ఏదైనా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి కానీ.. తాము అధికారంలోకి వస్తే జైల్లో వేసేస్తాం అనే హెచ్చరిక దేనికి సంకేతం. కచ్చితంగా అది రాజ ద్రోహం కేసు కింద వస్తుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచారు రఘురామకృష్ణం రాజు( Raghuram Krishnam Raju) . సొంత పార్టీ వైఫల్యాలను ఆయన ఎండగట్టేవారు. ఆయనపై అప్పట్లో రాజ ద్రోహం కేసు వేశారు. అయితే ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి పై ఎందుకు రాజా ద్రోహం కేసు వేయకూడదు.. ఏకంగా ప్రభుత్వ పాలనా విధానాలపై ప్రభావం చూపుతున్నారు జగన్మోహన్ రెడ్డి. పాము అధికారంలోకి వస్తే జైల్లో వేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణ చేస్తామని చెబుతోంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం సైతం అదేవిధంగా సూచించింది. అలా ముందుకెళ్తే సంబంధిత బాధ్యతలు తీసుకునే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని.. అరెస్టు చేస్తామని జగన్మోహన్ రెడ్డి వారిని భయపెడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే పాలకపక్షానికి సమాంతరంగా పాలన సాగిస్తున్నట్లు అర్థమవుతోంది.
* నాడు అలా చెప్పలేదు..
జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) హయాంలో అమరావతిని మార్చేశారు. అమరావతి కోసం పోరాటం చేస్తున్న రైతులపై దండయాత్ర చేసినంత పని చేశారు. విశాఖ రాజధాని అని చెబుతూ అమరావతిలో సెంటు భూమి చొప్పున ఇళ్ల స్థలాలు కూడా అందించేశారు. అటువంటిప్పుడు అప్పటి ప్రతిపక్షంగా ఉన్న టిడిపి ఇలానే ప్రవర్తించిందా? తాము అధికారంలోకి వస్తే అమరావతి పునర్నిర్మాణం చేపడతామని చెప్పిందే కానీ.. అరెస్టులు చేస్తామని హెచ్చరించలేదే. జైల్లో పెడతామని హెచ్చరించలేదే. అంతెందుకు లక్షలాదిమంది వాలంటీర్లను నియమించి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు. ఈ ప్రకటనల రూపంలో సాక్షికి వందల కోట్ల రూపాయలు ధారపోశారు. అవి తప్పు అని చెప్పిందే కానీ అమలు చేసిన అధికారులను అరెస్టు చేస్తామని టిడిపి చెప్పలేదు కదా?
* టిడిపి అలా వ్యవహరించలేదు..
రాజకీయంగా ఇబ్బంది పెట్టిన వారికి.. తాము అధికారంలోకి వస్తే చుక్కలు చూపిస్తామని మాత్రమే చెప్పింది టిడిపి. కానీ పాలనాపరమైన ఏ అంశాల విషయంలో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా హెచ్చరించలేదు. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల నిర్వహణకు సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని సమర్థిస్తోంది. కానీ జగన్ మాత్రం విపరీతంగా వ్యతిరేకించి హెచ్చరిస్తున్నారు. ఒక విధంగా చెబితే ప్రభుత్వ పాలనను ఆయన అడ్డుకుంటున్నారు. పాలనను అడ్డుకోవడం అంటే అది రాజ ద్రోహం కిందకే వస్తుంది. మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేశారని రఘురామకృష్ణం రాజును రాజ ద్రోహిగా చూశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ పాలనకు జగన్మోహన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. ఇందులో వైఫల్యాలు ఉంటే తాము అధికారంలోకి వస్తే విచారణ చేపడతామని చెప్పాలే కానీ.. ఎవరైనా దరఖాస్తులు చేసుకుంటే అరెస్టు చేస్తామని చెప్పడం మాత్రం నిజంగా రాజద్రోహమే. అయితే ఈ విషయంలో కేంద్రం కలుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగితే అది రాజకీయ కోణంలో చూస్తారు. కేంద్రం చర్యలకు దిగితే అది పాలసీ కిందకు వస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల పాలనకు సంబంధించి కేంద్రం జోక్యం చేసుకోదు. గతంలోనూ ఇది స్పష్టమైంది కూడా. అయితే ఇప్పుడు జగన్ పై రాజ ద్రోహం కేసు పెడితే రాజకీయంగా వాడుకుంటారు అనేది కూటమి అనుమానం. అందుకే తన పని తాను చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడినట్లు స్పష్టమవుతోంది.