Jagan Assembly: వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) వైఖరి ఎవరికి అంతు పట్టదు. నలుగురికి నచ్చేది ఆయనకు నచ్చదు. నలుగురు వెళ్లే మార్గంలో కూడా ఆయన వెళ్ళరు. అందుకే అటువంటి స్వభావం ఉన్నవారు ఆయనకు ఫిదా అవుతుంటారు. సింహం సింగిల్ గా వస్తుంది… దమ్ముంటే ఒంటరిగా రా.. ఇలాంటి నినాదాలు ఆయనకు సొంతం. తనకంటూ ఒక భావజాలం ఉంటుంది. తాను నచ్చిందే చేస్తాడు.. తనకు ఇష్టమైన మార్గంలోనే నడుస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరి మాట వినడు. చివరకు తన తండ్రి సమకాలీకులు అయిన నేతల మాటలు కూడా అస్సలు పట్టించుకోడు. అటువంటి వారంతా ఫేవర్ చేయాలని భావిస్తారు. కానీ ఒకరు చెబితే నాకేంటి అన్నట్టు ఉంటారు. అందుకు బాగానే మూల్యం చెల్లించుకున్నారు. కానీ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. ఒరేయ్ బాబు నువ్వు చేసింది తప్పు అని చెప్పినా వినిపించుకునే ధోరణి లేదు. అందుకే తల్లి విజయమ్మ దూరమయ్యారు. చెల్లెలు షర్మిల విభేదిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి కి ఆత్మగా భావిస్తున్న కెవిపి రామచంద్రరావు సైతం దూరంగా ఉన్నారు. నిత్యం రాజశేఖర్ రెడ్డి తో ఉండే సూరీడు సైతం అటువైపు చూడడం లేదు. రాజశేఖర్ రెడ్డి కుటుంబం పట్ల అభిమానం చూపే రాజకీయ విశ్లేషకుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ సైతం చేతులెత్తేశారు.
* రాజశేఖర్ రెడ్డి సన్నిహిత నేతగా
రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజమండ్రి ఎంపీ అయ్యారు ఉండవల్లి అరుణ్ కుమార్ ( Arun Kumar). ఆయన సామాన్య కార్యకర్తగా, ఆపై నాయకుడిగా కొనసాగుతూ వచ్చారు. రాజశేఖర్ రెడ్డి గుర్తించి 2004లో రాజమండ్రి ఎంపీ సీటును ఇప్పించారు. ఉండవెల్లి అరుణ్ కుమార్ గెలిచారు. 2009లో సైతం రాజశేఖర్ రెడ్డి ఆయనపై నమ్మకం పెట్టుకున్నారు. రెండోసారి టిక్కెట్ ఇచ్చారు. అప్పుడు కూడా గెలిచారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణం, ఆపై రాష్ట్ర విభజన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ కాంగ్రెస్ భావజాలాన్ని తన మదిలో పెట్టుకున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తూ వచ్చారు. జాతీయస్థాయిలో బిజెపి వ్యతిరేక వైఖరి అనుసరిస్తున్నారు. అదే సమయంలో తన మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా మద్దతు తెలపలేక.. పరోక్షంగా సహాయం చేయాలని భావిస్తున్నారు. కానీ ఐ డోంట్ కేర్.. నేను ఎవరి మాట వినే రకం కాదు అంటూ తన తండ్రి సన్నిహితుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ మాట అస్సలు వినడం లేదు జగన్.
* జగన్ వినక పోయేసరికి..
అయితే రాజకీయ నాయకుడి నుంచి విశ్లేషకుడుగా మారిన ఉండవెల్లి అరుణ్ కుమార్ జగన్ కోసం చేయని ప్రయత్నం లేదు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు మారు మాట ఆడని ఆయన ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కు అనేక రకాల సలహాలు ఇస్తున్నారు. జగన్ లేకపోతే ఏంటి పవన్ ప్రతిపక్ష పాత్ర పోషించవచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు. ఐదేళ్లపాటు సవ్యంగా పాలన సాగించారని భావించినట్టు ఉన్నారు ఉండవెల్లి. అందుకే జగన్ అధికారంలో ఉన్నప్పుడు సుతిమెత్తటి హెచ్చరికలు.. జగన్కు అనుకూలమైన విశ్లేషణలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నది చంద్రబాబు సర్కార్. చంద్రబాబుకు నేరుగా వ్యతిరేకించలేక.. మద్దతు తెలపలేక.. ఉండవల్లి అరుణ్ కుమార్ కింద మీద పడుతున్నారు. ఒరేయ్ బాబు జగన్ అసెంబ్లీకి వెళ్ళరా నీకు దండం పెడతా.. ఇంతకంటే మంచి తరుణం మరొకటి ఉండదురా అని సలహాలు ఇస్తున్నారు కానీ.. ఉండవెల్లి అంకుల్ మీరు చెప్పేది నేను చేయడం ఏంటి.. అని జగన్ లైట్ తీసుకుంటున్నారు.
@ysjagan అన్న అసెంబ్లీ కీ వేళ్ళు అన్న pic.twitter.com/brQGf1ZLfg
— (@2029YSJ) November 3, 2025