Woman Dance Reels At Srisailam: రీల్స్( reels) పిచ్చితో కొందరు చేసే పనులు అతిగా ఉంటున్నాయి. తాజాగా శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో యువతి రీల్స్ చేయడంపై విమర్శలు వచ్చాయి. ఆలయానికి సమీపంలోని రోడ్డుపై ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ వీడియో తీసుకొని.. సదరు యువతి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అది విపరీతంగా వైరల్ అయ్యింది. యువతి తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దీనిపై ఆమె తాజాగా స్పందించింది. అయితే క్షమాపణ చెబుతుంది అనుకుంటే.. తనది తప్పు కాదు అన్నట్టు ఆమె చెబుతున్నారు. మూడు రోజుల కిందట ఆ రీల్స్ చేసింది సదరు యువతి. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు రావడం.. వివాదాస్పదం కావడంతో ఆమె స్పందించింది.
క్షమాపణ కోరిన యువతి..
ప్రధానంగా ఈ పాట మాంసం, మద్యపానం ప్రస్తావిస్తూ సాగింది. అటువంటి పాట కావడంతో ఎక్కువ మంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దైవ సన్నిధిలో ఇటువంటి పనులు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇలా అభ్యంతరాలు ఎక్కువ కావడంతో సదరు యువతి స్పందించింది. ఓ వీడియోను విడుదల చేసింది.’ లోకేషన్ బాగుందని పద్ధతిగా చీర కట్టుకొని రీల్ చేశా. అది కూడా ఆలయం బయట రోడ్డు మీద చేశా. సాంప్రదాయంగానే వీడియోలో డాన్స్ చేశా.. చిన్న చిన్న బట్టలు వేసుకుని బ్యాడ్గా బిహేవ్ చేయలేదు. దానికి నా మీద ఇష్టం వచ్చిన కామెంట్లు పెడుతున్నారు ‘ అంటూ ఆ యువతి ఆవేదన వ్యక్తం చేశారు. నేను గుడిలో డాన్స్ చేయలేదు. ఒకవేళ తప్పు చేసి ఉంటే క్షమించండి అని కోరారు. అయితే ఈ రీల్ వైరల్ కావడంతో ఆమె టార్గెట్ అయ్యారు. మీడియాలో ప్రత్యేక కథనాలు వస్తుండడం, ఇన్ స్టాలో, యూట్యూబ్ లో పెద్ద ఎత్తున ఆమె ట్రోల్ అయ్యారు. ఇది మరింత పెద్దదిగా కాకూడదు అనుకుని ఆమె ప్రత్యేక వీడియోను విడుదల చేసినట్లు తెలుస్తోంది.
చర్యలకు సిద్ధం..
మరోవైపు ఈ ఘటనను శ్రీశైలం( Srisailam) ఆలయ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. శ్రీశైలం పరిసరాల్లో, వీధుల్లో రీల్స్, వీడియోలపై నిషేధం విధించారు. అనుమతి లేకుండా వీడియోలు తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు సదరు యువతిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే ఆమె క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం కొంతవరకు సద్దుమణిగింది. అయితే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటేనే మరొకరు ఇటువంటి పనులు చేయరని భక్తులు అభిప్రాయపడుతున్నారు.
View this post on Instagram