Woman Harassment Video: వయసులో ఉన్నావు. నేను కూడా అదే వయసులో ఉన్నాను..నీ అందం నన్ను పిచ్చెక్కించేస్తోంది. నీ పరువాలు నా మతి పోగోడుతున్నాయి.. అందుకే ఇలా వచ్చాను.. ఎటువంటి ఆచ్చాధన లేకుండా నీ ముందు నిలిచాను. నువ్వు కూడా అలానే మారిపో..నా వయసు దాహాన్ని తీర్చేసేయ్” అంటూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ ఓ మహిళకు వీడియో కాల్ చేసిన విషయం తెలిసిందే.
Also Read: ఉచిత ప్రయాణం.. ఆటో డ్రైవర్ల పరిస్థితేంటి!?
అతడి వేధింపులను కొంతకాలంగా మౌనంగా భరిస్తున్న ఆమె.. తట్టుకోలేక ఈ వ్యవహారాన్ని బయటపెట్టింది. అతడు వీడియో కాల్ చేస్తున్న వ్యవహారాన్ని మొత్తం రికార్డ్ చేసింది. దీంతో ఎస్ఐ రాజశేఖర్ బండారం మొత్తం బయటపడింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన సత్యసాయి జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారుల విచారణలో ఎస్ఐ రాజశేఖర్ తప్పు చేశాడని తేలింది. సదరు మహిళ తన స్నేహితురాలు విడాకుల విషయంలో భరణానికి సంబంధించి ఎస్ఐని సంప్రదించినట్టు తెలిసింది. కేసు పరిష్కారాన్ని పక్కన పెట్టి.. ఆ మహిళపై కన్నేసిన ఎస్ఐ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇక అప్పట్నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. రోజు వీడియో కాల్ చేయడం.. నగ్నంగా మారిపోవాలని డిమాండ్ చేయడం.. అలా చేయకపోతే కేసులు పెట్టి ఇబ్బంది పెడతానని వేధించడం మొదలుపెట్టాడు. ఆ మహిళ భర్త కూడా ఎస్సైని ప్రాధేయపడినప్పటికీ వినిపించుకోలేదు. దీంతో ఇటీవల ఆ ఎస్సై ఆ మహిళకు వీడియో కాల్ చేసి తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.
ALso Read: ఏపీలో ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం తొలిరోజు.. స్పందన ఎలా ఉందంటే?
ఈ వ్యవహారం మొత్తాన్ని వీడియో రికార్డ్ చేసి ఆమె మీడియాకు పంపింది. ఈ విషయం మొత్తం సత్యసాయి జిల్లా ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఆయన శాఖ పరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. విచారణలో సదరు ఎస్సై తప్పు చేశాడని తెలియడంతో.. అతడిని సర్వీస్ నుంచి తొలగిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు అతనిపై కేసులు కూడా నమోదు చేయాలని అధికారులకు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆ మహిళకు న్యాయం జరిగినట్టయింది. పట్నం పోలీస్ స్టేషన్ కు ఎస్ఐగా వచ్చినప్పటి నుంచి రాజశేఖర్ ఇలానే వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. పైగా వివిధ కేసుల నిమిత్తం పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్టు ఉన్నతాధికారుల విచారణలో తేలింది.