TDP Vs YCP: వైసీపీలోకి గెలుపు గుర్రాలు.. టీడీపీలోకి స్క్రాప్ లా?

ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో మార్ఫ్ డ్ వీడియోలను రూపొందించడం.

Written By: Anabothula Bhaskar, Updated On : January 12, 2024 9:28 am

TDP Vs YCP

Follow us on

TDP Vs YCP: సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త వింతలన్నీ చోటు చేసుకుంటున్నాయి. అనని మాట అన్నట్టు.. చేయని పనిని చేసినట్టు కల్పించడం పరిపాటిగా మారుతున్నది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్త కొత్త విషయాలన్నీ వ్యాప్తిలోకి వస్తున్నాయి. ఆ మధ్య రష్మిక మందన్న ఒక హాట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వ్యాప్తిలో ఉంది. చాలామంది ఆ వీడియోలో ఉన్నది రష్మికనే అనుకున్నారు. కానీ చివరికి ఆమె స్పందించక తప్పలేదు. ఇందులో ఉన్నది తను కాదని చెప్పినప్పటికీ ఎవరూ వినిపించుకోలేదు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించిన వీడియో అని తర్వాత తేలిపోవడంతో ఆమెకు సంఘీభావంగా దేశం మొత్తం నిలబడింది. వివిధ సినిమా ఇండస్ట్రీలు ఆమెకు అండగా నిలిచాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మంచి కోసం వాడాలి గాని.. ఇలాంటి పనులకు వాడకూడదని ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు హితవు పలికారు. పెరిగిన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం రష్మికతోనే వదిలిపెట్టలేదు. నరేంద్ర మోడీ గొంతును తెలుగులోకి అనువదించి.. ఆయనే మాట్లాడారు అనే విధంగా రూపొందించిన వీడియోలు ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.

ఇక ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సహాయంతో మార్ఫ్ డ్ వీడియోలను రూపొందించడం.. వాటిని వ్యాప్తి చేయడం పరిపాటిగా మారిపోయింది. ఫలితంగా ఏది నిజమో, ఏది అబద్దమో కనిపెట్టడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. తాజాగా ఆంధ్ర పాలిటిక్స్ అనే ట్విట్టర్ ఐడి నుంచి ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు.. గెలుపు గుర్రాలు వైసీపీలోకి.. టిడిపికి గా*** అన్నట్టుగా ఉండటం సంచలనానికి దారితీస్తోంది. ఎన్నికలవేళ చంద్రబాబు ఇలా మాట్లాడి ఉంటాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే జాగ్రత్తగా తరచి వింటే అందులో వినిపించేది చంద్రబాబు నాయుడు లాంటి గొంతే. కాకపోతే అది ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించింది..

అయితే ఇప్పటికే ఈ వీడియో వేలాది వ్యూస్ నమోదు చేసుకుంది. ఈ వీడియోను వైసిపి అనుకూల నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అదే స్థాయిలో టిడిపి నాయకులు కూడా కౌంటర్ ఇస్తున్నారు. వారు కూడా పోటాపోటీగా జగన్ మాట్లాడిన విధంగా వీడియోలు రూపొందించి పోస్ట్ చేస్తున్నారు. ఎన్నికలవేళ అటు టిడిపి, ఇటు వైసిపి హోరాహోరీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వీడియోలను పోస్ట్ చేసుకుంటుండడం విశేషం. అయితే ఇందులో ఏది నిజమో, ఏది అబద్దమో తేల్చుకోలేక న్యూట్రల్ నెటిజన్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల ముందే ఇలా ఉంటే.. నోటిఫికేషన్ జారీ అయితే పరిస్థితి ఉంటుందో మరి.