Homeఆంధ్రప్రదేశ్‌YSRCP political image issue: 'గొడ్డలి' ముద్ర వైసిపి కొంప ముంచుతుందా?!

YSRCP political image issue: ‘గొడ్డలి’ ముద్ర వైసిపి కొంప ముంచుతుందా?!

YSRCP political image issue: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఆ పార్టీ ఎంత ఉవ్వెత్తున ఎగసిందో.. అదే స్థాయిలో వ్యతిరేక ప్రచారానికి బాధిత వర్గంగా మారింది. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆ పార్టీ సానుకూలత పొందింది. 2019 ఎన్నికల్లో సానుభూతి పనిచేసే ఆ పార్టీ విజయం సాధించింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి అదే ప్రతికూలతగా మారింది. వ్యతిరేక ప్రచారంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ ఓటమి ఎదురయింది. అయితే ఇప్పుడు అదే అంశం 2029 ఎన్నికల వరకు సజీవంగా ఉంటే పార్టీకి నష్టం అని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

ప్రజల్లోకి బలంగా..
ప్రధానంగా గొడ్డలి పార్టీ అనే మాట.. ఆ పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రారంభంలో పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు ఆ పార్టీ. కానీ క్రమేపి అది ప్రజల్లోకి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ అంటూ ప్రశ్నించారు. గన్ కల్చర్ అంటూ టిడిపి పై ఆరోపణ చేశారు. అదే విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శృతి పంచుకున్నారు. గన్ కల్చర్ అంటూ ఆరోపణలు చేశారు. కానీ వైసీపీకి గొడ్డలి పార్టీ అనే ముద్ర చాలా వేగంగా వెళ్ళిపోయింది. కానీ టిడిపికి గన్ కల్చర్ అనే పేరు పెద్దగా వర్కౌట్ కాలేదు. కచ్చితంగా ఇది ప్రభావం చూపుతోందన్న భయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అందుకే గొడ్డలి పార్టీ అనే కామెంట్స్ ను సహించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా కామెంట్స్ చేస్తే తట్టుకోలేకపోతున్నారు.

అప్పట్లో రాజశేఖర్ రెడ్డి..
ఇప్పటికే గొడ్డలి పార్టీ అనే పేరు ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. అంతలా ప్రత్యర్థి పార్టీకి చెందిన మీడియా సోషల్ మీడియా దీనిని బలంగా తీసుకెళ్లగలిగింది. వాస్తవానికి 2004 కంటే ముందే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాలి. కానీ ఫ్యాక్షన్ ముద్ర రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా చేసింది. ఆ కుటుంబం పై అంతలా ప్రచారం అప్పట్లో నడిచింది. వైయస్ రాజారెడ్డి యాక్షన్ ముద్ర రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ప్రభావం చూపింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫ్యాక్షన్ ప్రచారం పతాక స్థాయికి చేరింది. అది కూడా జగన్ మోహన్ రెడ్డి స్వయంకృతాపమే. ఎందుకంటే ప్రెస్మీట్లో తన తాతను చంపిన వారిని సైతం తాను ఏం చేయలేదని చెప్పి ఆ తేనె తుట్టను కదిపారు. అయితే ఇప్పుడు గొడ్డలి పార్టీ అంటేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విలవిలలాడిపోతుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular