Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్( duvvada Srinivas) బీజేపీలో చేరుతారా? ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నారా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. త్వరలో ఆయనపై శాశ్వత బహిష్కరణ జరుగుతుందని ప్రచారం నడుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలుగా ఉన్న ధర్మాన బ్రదర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు దువ్వాడ. గతంలో కుటుంబ వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో పార్టీ ఆయన పై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే దీని వెనుక ధర్మాన బ్రదర్స్ హస్తం ఉందన్నది దువ్వాడ అనుమానం. ఇప్పుడు ఆ బాధతోనే ధర్మాన బ్రదర్స్ పై నిప్పులు చెరుగుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. అయితే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ పై శాశ్వత బహిష్కరణ వేటు వేయాలని డిమాండ్ అధినేత పై పెరుగుతోంది. అదే జరిగితే దువ్వాడ ప్రయాణం ఎటు అనేది ఒక చర్చ.
* జగన్ పట్ల గౌరవం..
దువ్వాడ శ్రీనివాస్ తనపై సస్పెన్షన్ వేటుపడినా.. జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) విషయంలో గౌరవభావంతోనే ఉన్నారు. ఇప్పటికీ ఆయన విషయంలో గౌరవాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. కానీ శాశ్వత బహిష్కరణ చేస్తే మాత్రం దువ్వాడ శ్రీనివాస్ మరింత స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే ఇండిపెండెంట్ గా నిలిచి ధర్మాన కుటుంబాన్ని ఎదుర్కొంటానని చెబుతున్న ఏదో ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు ఆయనకు అవసరం. అలాగని టిడిపి తో పాటు జనసేనలో చేరలేరు. ఒకవేళ దువ్వాడ శ్రీనివాస్ చేరుతానన్న అక్కడ చేర్చుకునే పొజిషన్ లేదు. అయితే ఇప్పుడు ఆయనకు కనిపిస్తోంది బిజెపి మాత్రమే. అయితే ఆ పార్టీలో చేరడం కూడా అంత సులువు కాదు. ఎందుకంటే కింజరాపు ఫ్యామిలీ అనుమతి లేనిదే బిజెపిలో కూడా ఎంట్రీ కష్టమే.
* ఆ ఉద్దేశంతోనే బిజెపిలోకి..
అయితే జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలంటే దువ్వాడ శ్రీనివాస్ లాంటి నేతను బిజెపిలో చేర్పించాలి. కానీ ఆయన ధర్మాన ఫ్యామిలీతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాల్సి ఉంటుంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి పట్ల విపరీతమైన అభిమానంతో ఉంటున్నారు. పోనీ తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటుంది అంటే అది కనిపించడం లేదు. ఎందుకంటే జిల్లాలో దువ్వాడ కంటే ధర్మాన ఫ్యామిలీకి బ్యాక్ గ్రౌండ్ ఎక్కువ. పార్టీకి వారు కీలకం కూడా. పైగా దువ్వాడ శ్రీనివాస్ పై వివాదాస్పద ముద్ర ఉంది. వదులుకుంటే దువ్వాడ శ్రీనివాస్ ను వదులుకుంటారు కానీ.. ధర్మాన బ్రదర్స్ ను వదులుకునే ఛాన్స్ లేదు. అయితే బిజెపిలో చేరిక కూడా దువ్వాడకు అంత ఈజీ కాదు.. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టిడిపి తో పాటు జనసేనలో చేరను కానీ.. బిజెపి విషయంలో మాత్రం అలా మాట్లాడడం లేదు. సో ఆయనకు బిజెపి ఆప్షన్ గా ఉంది. కానీ ఆ పార్టీ చేర్పించుకుంటుందా? లేదా అన్నది అనుమానం.