Anchor Shiva Jyothi Controversy: తిరుమల తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వెలసిన క్షేత్రం.. ఈ ఆలయాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కాదు, తెలంగాణ, యావత్ దేశం, ప్రపంచం మొత్తం దర్శించుకుంటుంది. తమ స్థాయిలో స్వామివారికి కానుకలు సమర్పిస్తుంది. ఎంతో చారిత్రాత్మక వైభవాన్ని కలిగిన ఈ ఆలయం ఇప్పుడు నిత్యం వివాదాల మయంగా మారుతోంది. ఆ మధ్య కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించింది. దీన్ని మర్చిపోకముందే పరకామణి వ్యవహారం కలకలం రేపింది. ఈ కేసులు ఇంకా పరిష్కారం కాకముందే.. మరో వివాదం తిరుమల క్షేత్రాన్ని వార్తల్లో నిలిపింది.
ఈసారి తిరుమల క్షేత్రంలో వివాదానికి కారణమైన మహిళ పేరు శివ జ్యోతి అలియాస్ సావిత్రక్క. అప్పట్లో ఈమె వి6 ఛానల్ లో పనిచేసేది. తీన్మార్ వార్తలను చదివేది. ఆ తర్వాత విపరీతమైన పాపులారిటీ రావడంతో v6 నుంచి బయటికి వచ్చింది. కొద్దిరోజుల పాటు టీవీ9 లో పనిచేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళింది. అక్కడ విపరీతంగా శోకాలు పెట్టింది. అనంతరం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిందనే ఆరోపణలు వినిపించాయి. ఇటీవల తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమల వెళ్ళింది. తిరుమల ఎవరైనా భక్తితోనే వెళ్తారు. దేవుడి మీద నమ్మకం ఉంటేనే వెళ్తారు. క్యూలైన్లో ఉన్న భక్తులకు తిరుమలలో ప్రసాదం పెడతారు. అయితే దానిమీద ఒక వీడియో చేసింది. అసలే తిక్కల్ది కదా.. పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేసింది.. “తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం. మేము రిచెస్ట్ బిచ్చగాళ్ళం” అంటూ వ్యాఖ్యలు చేసింది. దీని కోసమా ఆమె తిరుమల వెళ్ళింది? ఇదంతా కూడా దేవుడి పట్ల తీవ్రమైన అపచారం కదా.. వాస్తవానికి ఇటువంటి లేకి వ్యాఖ్యలు చేసిన శివ జ్యోతి అలియాస్ సావిత్రక్క మీద రకరకాలుగా మాట్లాడొచ్చు.. కానీ ఇక్కడ సంస్కారం అడ్డొస్తోంది..
తిరుమల అనేది అద్భుతమైన క్షేత్రం. తిరుమల మీదుగా కనీసం విమానాలను కూడా ప్రయాణించనివ్వరు. తిరుమలలో రియల్ చేయడం కూడా నిషేధం. అటువంటి చోట దేవుడి ప్రసాదం మీద నీచమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? శివ జ్యోతి అలియాస్ సావిత్రక్క సెలబ్రిటీ కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చా? ఈ చిల్లర వేషాలు వేసే వారిని బీ ఆర్ నాయుడు ఏమి చేయలేరా? తన ఆధ్వర్యంలో తిరుమల లడ్డు క్వాలిటీ విపరీతంగా పెరిగిందని చెప్పుకునే ఆయన.. ఇటువంటి వెకిలి క్యారెక్టర్ల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేరా.. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి ప్రధాన మీడియా వరకు వ్యతిరేకత వస్తుంది కాబట్టి క్షమించండి అని.. ఆ పోస్టు రిమూవ్ చేసి సారి చెబుతుందేమో గాని.. శివ జ్యోతి చేసింది మామూలు తప్పు కాదు.. ఇటువంటి వ్యక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గట్టి గుణపాఠం చెప్పాలి. అప్పుడే వెకిలి వీడియోలు చేయరు. లేకి కామెంట్లు పెట్టరు.
తిరుపతిలో “కాస్ట్లీ ప్రసాదం అడుకున్నాం”, “ఇక్కడ రిచెస్ట్ బిచ్చగాళ్లం” అన్న శివజ్యోతి వ్యాఖ్యలపై భక్తులు–హిందూ సంఘాల ఆగ్రహం వ్యక్తమైంది. #TTD #Tirumala #ShivaJyothi #Comments @iamshivajyothi pic.twitter.com/Ik5ltuiu92
— BIG TV Cinema (@BigtvCinema) November 22, 2025