Anju Mane honesty: రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తాం. పది రూపాయలు కాగితం కనిపిస్తే… రెండవ కంటికి కనిపించకుండానే తీసుకుంటాం.. ఆ తర్వాత అక్కడి నుంచి మెల్లగా జారుకుంటాం. అలాంటిది నడిరోడ్డు మీద పది లక్షలు కనిపిస్తే.. ఇంకా ఏమైనా ఉందా.. సుడిగాలి వేగంతో పరుగులు పెడతాం. ఆ డబ్బులను లెక్కిస్తూ పండగ చేసుకుంటాం. ఎలా ఖర్చు పెట్టాలి.. ఏ వస్తువులు కొనుగోలు చేయాలి.. ఎలా ఎంజాయ్ చేయాలి.. ఇలా ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటాం.
నడిరోడ్డు మీద పది లక్షలు దొరికితే ఈ మహిళ మాత్రం హడావిడి చేయలేదు. భారీగా నగదు దొరికిందని సంబరపడలేదు. పైగా పరుల సొమ్ము పాము వంటిదని భావించిన ఆమె.. తనకు ఆ నగదు వద్దనుకొంది. అంతేకాదు తనకు దొరికిన ఆ నగదును సంబంధిత వ్యక్తికి అందజేసి.. తన నిజాయితీని నిరూపించుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలో ముంబై తర్వాత అతిపెద్ద నగరమైన పూణేలో అంజు మానే అనే మహిళ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. విధులలో భాగంగా గురువారం ఆమె చెత్త ఏరుతోంది.. ఇంతలోనే ఆమెకు ఒక బ్యాగ్ దొరికింది.. అందులో డబ్బు, మందులు కనిపించాయి.. ఆ బ్యాగు ఎవరిదో తెలుసుకోవడానికి ఆమె ఆ వీధి మొత్తం పెరిగింది.. ఒక వ్యక్తి తీవ్ర ఒత్తిడితో ఆ వీధి మొత్తం తిరుగుతుండగా ఆమె అతడిని గుర్తించింది.. వెంటనే అతడికి తాగడానికి మీరు కూడా ఇచ్చింది.. అంతేకాదు అతడు పోగొట్టుకున్న నగదు, మందుల గురించి ప్రస్తావించడంతో.. ఆ బ్యాగు అతడిదేనని ఆమె గుర్తించింది. ఆ బ్యాగును, మందులను అతనికి అప్పగించింది.. దీంతో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాదు తనకు పది లక్షల నగదు, విలువైన మందులు ఇవ్వడంతో ఆ వ్యక్తి కృతజ్ఞతగా ఆ మహిళకు చీర, కొంత డబ్బు ఇచ్చాడు.
అంజూ నిజాయితీ గురించి సోషల్ మీడియాలో పెద్ద పెట్టున ప్రచారం జరగడంతో ఒక్కసారిగా ఆమె గురించి చర్చ మొదలైంది.. చాలామంది ఆమెను కలుసుకొని ప్రశంసిస్తున్నారు. కొందరు డబ్బు ఇచ్చి గొప్ప పని చేశావంటూ అభినందిస్తున్నారు.. పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న ఆమె తన నిజాయితీని చాటుకుందని.. ఇటువంటి వారు సమాజానికి చాలా అవసరమని నెటిజన్లు పేర్కొంటున్నారు.