Varanasi movie latest updates: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి సాధ్యం కానటువంటి గొప్ప రీతిలో సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్లలో రాజమౌళి ఒకరు. ఆయన చేసిన సినిమాలతో ఇప్పటివరకు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన లాంటి దర్శకుడు మరొకరు ఉండరనేది వాస్తవం…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు సంబంధించిన ప్రతి న్యూస్ ను వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ ను, మహేష్ బాబు లుక్ ని కూడా రివీల్ చేశాడు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి వ్యవహరిస్తున్నారు.
ఆయన సైతం సినిమా మీద హైప్ ను పెంచేలా ఒక సాంగ్ రిలీజ్ చేశాడు. ఇక దాంతో పాటుగా రీసెంట్ గా ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ మూవీలో ఆరు పాటలు ఉంటాయని ఆరింటికి ఆరు ఒక్కొక్క దానికి సంబంధం లేకుండా సపరేట్ ట్రాక్ లో ఉంటాయని ఆయన తెలియజేయడం విశేషం…
హాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఈ సినిమా మెప్పించే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే మ్యూజిక్ ను కూడా యూనివర్సల్ గా కంపోస్ట్ చేసినట్టుగా కూడా ఆయన తెలియజేశాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా 2027 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ మూవీ ని సక్సెస్ ఫుల్ గా డీల్ చేయడానికి రాజమౌళి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధిస్తోంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో పెద్ద ప్రశ్న గా మిగిలిపోయింది…ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా తో 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడితే మాత్రం ఇండియాలోనే ఈ సినిమాను మించిన సినిమా మరొకటి ఉండదనేది స్పష్టమవుతోంది…