Cyclones In AP: సువిశాల తీర ప్రాంతం ఏపీ ( Andhra Pradesh) సొంతం. తిరుపతి జిల్లా తడ నుంచి శ్రీకాకుళం జిల్లా డొంకూరు వరకు తీరం విస్తరించి ఉంది. అయితే ఏపీకి తీరం వరమో.. శాపమో తెలియని పరిస్థితి. ఎందుకంటే తరచూ తుఫానుల బెడద ఉంటుంది బంగాళాఖాతం నుంచి. ఏటా రెండు నుంచి మూడు తుఫాన్లు.. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి పెను తుఫాను. తుఫాన్లు వచ్చే క్రమంలో ఏపీ చిగురుటాకుల వణికి పోతుంది. తుఫాన్లతో అంతులేని నష్టం జరుగుతోంది. అయితే దేశంలో ఇతర రాష్ట్రాలకు లేనివిధంగా ఏపీకి మాత్రమే ఈ విపత్తులు ఎందుకు అనేది ఒక ప్రశ్న. అయితే ఏపీ భౌగోళిక స్థితిగతులే ఈ తుఫానులకు తరచూ కారణం. అందుకే ఏపీలో తీర ప్రాంతం పై తుఫాన్లు విరుచుకుపడుతుంటాయి.
Also Read: హత్యకు కుట్ర జరిగినా.. మోడీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు.. ఈ విషయం ఎలా బయటపడింది?
* గుజరాత్ తర్వాత పెద్ద తీర రాష్ట్రం..
గుజరాత్( Gujarat) తరువాత అతి పెద్ద తీర రాష్ట్రం ఏపీ మాత్రమే. సుమారు 974 కిలోమీటర్ల పొడవైన తూర్పు తీరరేఖ మనది. ఇది బంగాళాఖాతం వల్ల ఏర్పడింది. బంగాళాఖాతం ఉష్ణ మండలంలో ఉంటుంది. అందుకే ఇక్కడ ఉండే సముద్రపు నీరు కూడా ఎక్కువ వేడిని కలిగి ఉంటుంది. వేడినీరు తుఫానుల ఉత్పత్తికి ముఖ్యమైన ఇంధనం గా మారుతుంది. అందుకే బంగాళాఖాతంలో తరచూ తుఫానులు వచ్చి ఏపీ ని ఇబ్బంది పెడుతుంటాయి.
* ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సముద్రాల కంటే బంగాళాఖాతంలో తుఫాన్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సముద్రానికి సంబంధించి ఏపీలో తీర ప్రాంతం అధికంగా ఉంటుంది.
* సాధారణంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, తుఫాన్లు వాయువ్య దిశగా లేదా వాయువ్య పడమర దిశగా కదులుతూ ఉంటాయి. అందుకే ముందుగా ఏపీని తాకుతుంటాయి. అటు తరువాత ఒడిస్సా తో పాటు పశ్చిమ బెంగాల్ వైపు సంభవిస్తాయి.
* ఆంధ్రప్రదేశ్కు ఎక్కువగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తుఫాన్ల బెడద ఉంటుంది. ఒక్కోసారి ఇది డిసెంబర్ వరకు కూడా కొనసాగుతుంది.
* ఈశాన్యం నుంచి వచ్చే రుతుపవనాల గాలులు, సముద్ర ఉష్ణోగ్రతలు కలిపి తుఫాన్లు ఏర్పడడానికి కారణంగా మారుతున్నాయి. బంగాళాఖాతంలో వాయు పీడనంలో వచ్చే తేడాలు కూడా తుఫానులకు కారణం. ఈ తుఫానులకు ప్రభావితం అయ్యేది ముందుగా ఏపీ.
* ఏపీలో ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల వారికి ఎక్కువగా తుఫానుల తాకిడి ఉంటుంది. తీరానికి ఈ జిల్లాలు దగ్గరగా ఉండడమే అందుకు కారణం.