https://oktelugu.com/

Shilpa Ravichandra Reddy : వివాదానికి కారణమైన నేత ఎక్కడ? బన్నీని ఎందుకు పరామర్శించలేదు?

పుష్ప 2 చిత్రం విడుదల నుంచి వైసీపీ నేతలు ఎంత హడావిడి చేశారో అందరికీ తెలిసిందే. మెగా కుటుంబంలో విభేదాలు అన్న చిన్నపాటి ప్రచారాన్ని ఆసరాగా తీసుకొని.. అల్లు అర్జున్ ద్వారా రాజకీయం చేయాలని భావించారు వైసీపీ శ్రేణులు. కానీ ఓ నేత మాత్రం ఇప్పుడు అల్లు అర్జున్ పక్కన కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 15, 2024 / 11:25 AM IST

    Shilpa Ravichandra Reddy

    Follow us on

    Shilpa Ravichandra Reddy : హీరో అల్లు అర్జున్ ను అందరూ పరామర్శించారు. పలువురు సినీ ప్రముఖులు, ఆయన స్నేహితులు పెద్ద ఎత్తున పరామర్శించి ధైర్యం చెప్పారు. అయితే అల్లు అర్జున్ వివాదాలకు కారణమైన శిల్పా రవిచంద్ర రెడ్డి మాత్రం కనిపించలేదు. వాస్తవానికి ఈ వివాదాలన్నింటికీ కారణం ఆయనే. ఎన్నికలకు ముందు నంద్యాల వైసీపీ అభ్యర్థిగా ఉన్న శిల్పా రవిచంద్ర రెడ్డి ని కలిసి మద్దతు తెలిపారు అల్లు అర్జున్. అప్పటికే మెగా కుటుంబం అంతా పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపింది. కొందరు పిఠాపురం వెళ్లి ప్రచారం కూడా చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ వివాదం ఏరి కోరి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభం అయింది. మొన్న సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన ఘటనలో కూడా అల్లు అర్జున్ పక్కనే రవి చంద్రారెడ్డి ఉన్నారు. అయితే రవిచంద్ర రెడ్డికి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చేసిన ట్వీట్ కారణంగానే.. అల్లు అర్జున్ తీసుకుని శిల్ప రవిచంద్రారెడ్డి ఆరోజు ప్రీమియర్ షో చూసేందుకు వెళ్లారని ఒక ప్రచారమైతే మాత్రం ఉంది. కానీ ఇంతటి వివాదం జరిగాక.. అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత శిల్పా రవిచంద్ర రెడ్డి ఎక్కడా కనిపించలేదు. దాదాపు ప్రముఖుల పరామర్శలకు సంబంధించి చిత్రాలు బయటకు వచ్చాయి. కానీ శిల్పా రవిచంద్ర రెడ్డి మాత్రం ఎక్కడా కనిపించకపోవడం విశేషం.

    * వైసీపీ శ్రేణుల హడావిడి
    పుష్ప 2 చిత్రం విడుదల నుంచి వైసీపీ శ్రేణులు హడావిడి చేశాయి. ఆ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద జగన్ ఫోటోలతో నింపేసాయి. ఒకరిద్దరు వైసీపీ నేతలు ఆ సినిమా నేరుగా చూసి రివ్యూ కూడా ఇచ్చారు. కొన్నిచోట్ల వివాదాలు కూడా నడిచాయి. ఆ సినిమాను వైసీపీ శ్రేణులు ఓన్ చేసుకున్నాయి. దీనికి కారణం జనసేన. మెగా కుటుంబాన్ని విభేదించి అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు తెలిపారు. అక్కడి నుంచే అల్లు అర్జున్ ను తమ వాడిగా చూసుకుంటున్నాయి వైసీపీ శ్రేణులు.

    * కనిపించని శిల్పా రవిచంద్రారెడ్డి
    అయితే ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన శిల్పా రవిచంద్రారెడ్డి కనిపించకపోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్. అల్లు అర్జున్ కుటుంబం నియంత్రించిందా? ఇంతటి వివాదానికి కారణం ఆయన అని పక్కన పెట్టిందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే మొన్నటి సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దానికి ముందు ఒక ఎత్తు.. ఇప్పుడు ఒక ఎత్తు అన్నట్టు ప్రచారం నడుస్తోంది. అనవసరంగా వివాదం తెచ్చుకోవడం ఎందుకని అల్లు అర్జున్ ఆ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అందులో తన ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. అయితే సంధ్య థియేటర్ వద్దకు వెళ్లడానికి కారణం శిల్పా రవిచంద్రారెడ్డి అన్నది ఒక ఆరోపణ. అందుకే ఆయనను పక్కన పెట్టారని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.