Homeఆంధ్రప్రదేశ్‌BJP - Purandeshwari : ఎన్టీఆర్ కుమార్తె  పురంధేశ్వరికి బీజేపీ పగ్గాలు ఎందుకు ఇచ్చింది?

BJP – Purandeshwari : ఎన్టీఆర్ కుమార్తె  పురంధేశ్వరికి బీజేపీ పగ్గాలు ఎందుకు ఇచ్చింది?

BJP – Purandeshwari : ఏపీ బీజేపీ పగ్గాలు పురంధేశ్వరికి ఇవ్వడం వెనుక హైకమాండ్ వ్యూహమేంటి? కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆమెకు అనూహ్యంగా పదవి ఏమిటి? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది. సుదీర్ఘ కాలం కాపుల వద్ద బీజేపీ పగ్గాలు ఉన్నాయి. కాపులు రాజ్యాధికారానికి దూరంగా ఉండడంతో ఆ వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు బీజేపీ వ్యూహంతో ముందుకు సాగింది. కానీ జనసేనాని పవన్ దానికి బ్రేకులు వేశారు. పవన్ చరిష్మ ముందు బీజేపీ కాపు నినాదం తేలిపోయింది. అయితే ఇప్పుడు ఏకంగా కమ్మ సామాజికవర్గం…కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పురంధేశ్వరికి అధ్యక్ష స్థానం ఇవ్వడం మాత్రం సంచలనం కలిగిస్తోంది.

త్రిపురలో ఇదే తరహాలో బీజేపీ హైకమాండ్ ఆలోచన చేసింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతకు బీజేపీ పగ్గాలు అప్పగించింది. అక్కడ కాంగ్రెస్ నుంచి చేరికలకు అది ఎంతగానో దోహదపడింది. సామాజికవర్గ సమీకరణలు సైతం మారాయి. బీజేపీ ఫార్ములా వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు ఏపీలో కూడా పురంధేశ్వరిని అడ్డం పెట్టుకొని త్రిపుర తరహాలో ఒక ఫార్ములా అమలుచేస్తున్నట్టు ఉంది. ఆమె ఎన్టీఆర్ కుమార్తె. పైగా కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన మహిళా నాయకురాలు. ఇవన్నీ పార్టీకి లాభిస్తాయని హైకమాండ్ ఒక ఆలోచనతో ఉంది.

ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తిగా ఉన్న కమ్మ నాయకులను ఆమె బీజేపీ గూటికి తెచ్చే అవకాశముంది. రాజకీయాలపై మక్కువ ఉండి అవకాశం లేని కమ్మ తటస్థ నాయకులను సైతం ఆకర్షించే చరిష్మ పురంధేశ్వరి సొంతం.కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంతో పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ, వైసీపీలో అవకాశాలు లేని చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు. అటువంటి వారు పురంధేశ్వరి చొరవతో బీజేపీలోకి వచ్చేందుకు సుముఖత చూపుతారు.

తెలుగుదేశం నాయకత్వాన్ని కట్టడి చేసేందుకు కూడా పురంధేశ్వరి నియామకం దోహదపడుతుంది. మొన్నటివరకూ చంద్రబాబు నాయకత్వాన్ని పురంధేశ్వరి వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ ఇటీవల చంద్రబాబు కుటుంబంతో దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేస్తారని ప్రచారం సాగింది. వాటన్నింటినీ బ్రేక్ చేస్తూ బీజేపీ అగ్రనాయకత్వం ఏకంగా రాష్ట్ర పగ్గాలనే అప్పగించింది. పొత్తు ఉన్నా, లేకపోయినా టీడీపీకి ధీటైన నాయకత్వాన్ని తయారుచేయాలన్న ఉద్దేశ్యంతోనే బీజేపీ హైకమాండ్ ఒక వ్యూహం ప్రకారం నడుచుకున్నట్టు పురంధేశ్వరి నియామకంతో తేటతెల్లమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper
Exit mobile version