Bolla Brahmanaidu arrest news: హైదరాబాద్ భూకుంభకోణంలో వైసిపి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేరు బయటకు వచ్చింది. దాదాపు 1,000 కోట్ల భూమికి ఆయన స్కెచ్ వేశారని.. ఏకంగా ప్రభుత్వ జీవోలు మార్చేసారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. అయితే ఇది వెలుగులోకి వచ్చి రోజులు దాటుతున్న ఆయన అరెస్టు జరగలేదు. తెలంగాణ సర్కారులో కీలక వ్యక్తులు ఆయనను కాపాడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ముందస్తు బెయిల్ వచ్చేవరకు ఆయన అరెస్టు ఉండదన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పుడు ఆయన కుమారుడు గిరిబాబు ఏకంగా మీడియా ముందుకు వచ్చి తన తండ్రి తప్పు లేదని చెప్పుకొచ్చారు. ఇదంతా ఎల్లో మీడియా సృష్టిగా తేల్చి పడేశారు. వాస్తవానికి ఈ కుంభకోణాన్ని బయటకు తీసింది తమ బంధువులేనని చెప్పుకొచ్చారు. ఒకవైపు బ్రహ్మనాయుడు అరెస్టు జరగకపోగా… ఆయన కుమారుడు ఏకంగా ఒక వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది.
గులాబీ పార్టీ హయాంలో..
వినుకొండ ఎమ్మెల్యేగా ఉండేవారు బొల్లా బ్రహ్మనాయుడు. అయితే అప్పట్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది తెలంగాణలో. అక్కడ కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా.. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉండేవారు. పరస్పర రాజకీయ సహకారం ఉండేది వారిద్దరికీ. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణలో సైతం అధికార పార్టీ నాయకులుగా చలామణి అయ్యేవారు. ఆ సమయంలో జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా హైదరాబాదులో పాల్పంచుకునే వారన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బ్రహ్మనాయుడు గండిపేటలో 1000కోట్ల విలువైన 12 ఎకరాల భూమిని ప్రభుత్వ జీవోలను మార్చి.. కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇదంతా గులాబీ పార్టీ హయాంలో జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. కానీ ఇప్పుడు బ్రహ్మనాయుడు ను కాంగ్రెస్ ప్రభుత్వంలో కాపాడుతోంది ఎవరు అనేది కొత్త ప్రశ్న.
అప్పట్లో మంచి పేరు.
బ్రహ్మనాయుడుకు మంచి పేరు ఉండేది. నష్టాల్లో ఉన్న తిరుమల డైరీ ని లాభాల బాట పట్టించిన నేత. వైసీపీలోకి వెళ్లిన తర్వాత బ్రహ్మనాయుడు చుట్టూ విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. హైదరాబాదులో 1000 కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేశారన్న ఆరోపణ బయటకు రావడంతో సంచలనంగా మారింది. ఐదేళ్ల వైసిపి హయాంలో ఏపీలో ఆయన చాలా రకాలుగా అవినీతికి పాల్పడ్డారు అన్న ఆరోపణలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. బాధితులు ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. అయితే ఇదంతా ఎల్లో మీడియా సృష్టి అని ఆయన కుమారుడు గిరిబాబు తేల్చి చెబుతున్నారు. మరోవైపు తెలంగాణ పోలీసులు కూడా బ్రహ్మానాయుడును అరెస్టు చేసే ప్రయత్నం చేయడం లేదు. పరారీలో ఉన్నట్లు చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. ఆయనకు ముందస్తు బెయిల్ దక్కే వరకు అరెస్టు చేయరన్న పొలిటికల్ వర్గాల్లో ఉంది. అంతలా ఆయనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వెన్నుదన్ను లభిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
మా నాన్నపై ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది.
హైదరాబాద్లోని భూ వివాదంలో మా నాన్నకు ఎటువంటి సంబంధం లేదు.
మా బంధువులు ఆ భూమిని కొనుగోలు చేయడానికి ప్రయత్నించినప్పుడే వారికి మోసం అర్థం అయింది
మా బంధువులే ఈ మోసాన్ని బయటపెట్టారు. – బొల్ల బ్రహ్మనాయుడు కుమారుడు బొల్ల గిరిబాబు pic.twitter.com/y5EeVh3JmZ
— greatandhra (@greatandhranews) June 4, 2026
