బిసిలకు నేరానికి సంభందం ఏంటి?: స్పీకర్

ఇఎస్ఐ నేరానికి బిసిలకు సంబందం ఏంటి అని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబును ప్రశ్నించారు. నేరస్తులకు కులం అపాదించి ఆయా వర్గాలను అవమానిస్తున్నారని టీడీపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.అచ్చెన్నాయుడు బిసి అయినంత మాత్రన నేరం చేస్తే ఎలా వదిలేస్తారన్నారు. అమరావతిలో మీడియా తో మాట్లాడారు. ఇఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు నేరం చేయకపోతే ఆ స్కామ్ కు కారణం ఎవరో చంద్రబాబు చెప్పాలన్నారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ స్కామ్ జరిగిందనే విషయం […]

Written By: Neelambaram, Updated On : June 14, 2020 2:47 pm
Follow us on

ఇఎస్ఐ నేరానికి బిసిలకు సంబందం ఏంటి అని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం చంద్రబాబును ప్రశ్నించారు. నేరస్తులకు కులం అపాదించి ఆయా వర్గాలను అవమానిస్తున్నారని టీడీపీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.అచ్చెన్నాయుడు బిసి అయినంత మాత్రన నేరం చేస్తే ఎలా వదిలేస్తారన్నారు. అమరావతిలో మీడియా తో మాట్లాడారు. ఇఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు నేరం చేయకపోతే ఆ స్కామ్ కు కారణం ఎవరో చంద్రబాబు చెప్పాలన్నారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ స్కామ్ జరిగిందనే విషయం ఆయన గుర్తించాలన్నారు.అచ్చెన్నాయుడు అరెస్టుకు సంభందించిన సమాచారం ఏసీబీ, జైళ్ల శాఖ ముందుగానే ఇచ్చిందన్నారు. ఎందుకు అరెస్టు చేస్తుంది, ఏ ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేసున్నది మొత్తం సమాచారం అందించారని చెప్పారు.
అచ్చెన్నాయుడు విషయంలో నిబంధనల ప్రకారమే అధికారులు వ్యవహరించారని చెప్పారు. దర్యాప్తు సంస్థలు రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధుల విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నాయని తెలిపారు. ఎసిబి అధికారుల ఫండమెంటల్ డ్యూటీని  చంద్రబాబు రాజకీయాల కోసం తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. చేసిన నేరాలను అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు బిసిల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. అచ్చెన్నాయుడు ఎవరో ఏంటో మేము చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. అచ్చెన్నాయుడు నేరం విషయంలో గాంధీ, పూలే, అంబెడ్కర్ విగ్రహాల దగ్గర నిరసనలు చేసి ప్రజలకు  ఏమి సంకేతం ఇస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయంలో టీడీపీ చేస్తున్న ఆందోళనలు ఎస్సి, ఎస్టీ, బీసీలను అవమానించేలా ఉన్నాయన్నారు.
ఇఎస్ఐ నేరంలో లోతుగా విచారణ చేస్తే మని లాండరింగ్ చట్టంలో 3, 4 సెక్షన్లు    వర్తిస్తాయని స్పష్టం అవుతుందన్నారు. ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టి ఎవరి ఖాతాల్లో వేశారనే విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు. టెక్కలి చెందిన గ్రానైట్ వ్యాపారులు పాత్ర ఉందని సమాచారం అందుతుందని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అరెస్టు విషయంలో వాస్తవాలు తెలియాలని స్పీకర్ గా మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. అచ్చెన్నాయుడు విషయంలో బిసి అనే ముందు స్కామ్ లో భాధితులగా ఉన్నది ఎవరో టీడీపీ నేతలు ముందు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్సి, ఎస్టీ, బిసిలకు చేరాల్సిన లబ్దిని బిసి పేరు చెప్పి దోచేస్తారా అని ప్రశ్నించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి దృష్ట్యా చంద్రబాబు అనుమతించడం లేదన్నారు.
కరోన వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ ప్రసంగానికి ఆన్ లైన్ ద్వారా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సంప్రదాయం ప్రకారం ఎమ్మెల్యేలు అందరికీ సభకు  హాజరు కావాలని ఆహ్వానాలు పంపుతున్నట్లు చెప్పారు. 175 మంది ఎమ్మెల్యేల విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, సభలో 225 సీటింగ్ కెపాసిటీ ఉంది భౌతిక దూరం పాటించేలా సభకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.