Homeఆంధ్రప్రదేశ్‌Sajjala : సజ్జలకు జగన్ అప్పగించిన ఆ కొత్త బాధ్యతేంటి?

Sajjala : సజ్జలకు జగన్ అప్పగించిన ఆ కొత్త బాధ్యతేంటి?

Sajjala : ఏపీలో ముందస్తు ఎన్నికలు లేనట్టే. ఈ విషయంలో స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లేందుకు అధికార పక్షం మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. చాలా రోజులుగా ముందస్తుపై వార్తలు వస్తున్నాయి. ఏవేవో కారణాలు చూపుతూ జగన్ సర్కారు ముందస్తుకు వెళుతోందని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ అటువంటిదేమీ జరగలేదు. ఎన్నికలకు పట్టుమని పది రోజులు లేకపోవడం దాదాపు అవకాశాలు లేవు. ఇదే విషయమై వైసీపీ ముఖ్యనేత సజ్జల రామక్రిష్ణారెడ్డి మరింత క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.

వాస్తవానికి జగన్ సర్కారు ముందస్తు ఆలోచన చేసింది. కానీ రాజకీయ పరిస్థితులను భేరీజు వేసుకొని వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ నుంచి సానుకూలత వచ్చిందా? లేదా? అన్నది మాత్రం తెలియడం లేదు. అగ్రనేతలు గో హెడ్ అని చెప్పినా.. జగన్ మాత్రం లాభ నష్టాలపై ఒక అంచనాకు వచ్చి ముందస్తుపై ముందుకెళ్లకూడదని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ప్రధానంగా రాజ్యసభ స్థానాల దక్కించుకునేందుకేనన్న టాక్ నడుస్తోంది. మార్చిలో ఏపీకి సంబంధించి రాజ్యసభ స్థానాల ఎంపిక ఉంది.

ప్రస్తుతం రాజ్యసభలో వైసీపీకి తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. వచ్చే మార్చిలో మరో మూడు స్థానాలు దక్కే అవకాశం వైసీపీకి ఉంది. దీంతో ఎంపీల సంఖ్య 12కు చేరుకుంటుంది. అదే జరిగితే రాజ్యసభ స్థానాలు ఎక్కువగా ఉన్న పార్టీగా వైసీపీ జాతీయ స్థానంలో మూడోస్థానంలో ఉంటుంది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ రాజకీయంగా పట్టు బిగించడానికి రాజ్యసభ స్థానాలే కారణం. రాజ్యసభలో ఎక్కువ స్థానాలున్న టీఎంసీ కేంద్రంలో నిర్మాణాత్మక పోషించడానికి వీలుపడింది. వైసీపీ సైతం అదే బాటలో నడవడానికి డిసైడయ్యింది. అందుకే మార్చిలో రాజ్యసభ ఎన్నికల తరువాతే షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చింది.

అయితే ఇటీవల ముందస్తుపై చాలారకాలుగా కథనాలు వినిపిస్తున్నాయి. నారా లోకేష్ సైతం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముందస్తుకు ఎలా వెళతారని ప్రశ్నించారు. అటు చంద్రబాబు సైతం ముందస్తు తప్పదని హెచ్చరిస్తున్నారు. మొన్నటి మంత్రివర్గంలో సైతం జగన్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లాల పర్యటనలు సైతం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో సజ్జల రామక్రిష్ణారెడ్డి తొమ్మిది నెలల తరువాతే ఎన్నికలు అని బాంబు పేల్చారు. సజ్జలకు ముందస్తు లేదని చెప్పిన జగన్…చాలారకాలుగా బాధ్యతలు అప్పగించి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. బహుశా అది రాజ్యసభ ఎన్నికల బాధ్యత అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular