Weather alert for AP : తెలుగు రాష్ట్రాల్లో( Telugu States ) విభిన్న వాతావరణం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ ఎండల తీవ్రతతో పాటు భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు తాకాయి. ప్రభావం చూపుతున్నాయి. మరో మూడు రోజుల్లో కేరళ తీరానికి రుతుపవనాలు తాకనున్నాయి. ఫలితంగా రానున్న రెండు రోజుల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈనెల 27న పశ్చిమ మధ్య, సమీప ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.
* తెలంగాణలో సైతం..
ఒకవైపు రుతుపవనాలు, మరోవైపు ఉపరితల ఆవర్తనాలు, అరేబియా( Arabia) మహాసముద్రంలో ద్రోణి తోడు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కొనసాగుతాయి. ముఖ్యంగా తెలంగాణకు భారీ వర్ష సూచన ఉంది. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ చెబుతోంది. అందుకే తెలంగాణలో ఆరు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Also Read : ఒక్క ఏడాదిలో 34 సినిమాలు చేస్తే అందులో 25 భారీ హిట్స్.. ఎవరో గుర్తుపట్టారా…
* 27న అల్పపీడనం..
ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయుగుండం గా బలపడే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 27న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. రెండు రోజుల తర్వాత అది తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఏపీకి సంబంధించి అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మాస్టారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయి.