Nara Lokesh Family Life: యానిమల్ సినిమాలో తండ్రి కోసం ఆరాట పడే ఓ కొడుకు బాధ ఏంటో కళ్లకు కట్టారు. టాప్ బిజినెస్ మ్యాన్లు, పొలిటీషియన్లు తమ కుటుంబానికి సమయం కేటాయించలేక ఆ పనుల్లో బిజీ అవుతారు. కొడుకులు తండ్రి ప్రేమకు దూరమై కొందరు వక్ర మార్గాల్లో , ఇంకొందరు మరింత మొండిగా తయారవుతారు. అందుకే ఏ గొప్ప బిజినెస్ మ్యాన్, గొప్ప రాజకీయ నాయకుడు అయినా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి. వారితో సమయం గడపాలి. అప్పుడే అతడు నిజమైన పరిపూర్ణమైన పొలిటీషియన్ అవుతాడు. అలాగే ‘ఫ్యామిలీ మ్యాన్’గా చిరస్థాయిలో నిలిచిపోతాడు..ఇప్పుడు లోకేష్ ఆ ఘనత సాధించాడు..
Also Read: కానిస్టేబుల్ పోస్ట్ కు బీటెక్ గ్రాడ్యూయేట్ల క్యూ.. ఇలా ఉంది పరిస్థితి!
ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో అత్యంత కీలకమైన వ్యక్తి నారా లోకేష్. మంత్రిగా ఉన్న ఆయన ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కుమారుడు ఆయన. ఒకవైపు మంత్రిగా ఉంటూనే తెలుగుదేశం పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. పాలనలో భాగస్వామ్యం అవుతూనే తెలుగుదేశం పార్టీని పర్యవేక్షిస్తున్నారు. ఇటీవలే సింగపూర్ పర్యటన ముగించుకొని ఏపీకి వచ్చారు. అయితే ఎంతటి వారైనా ఓ బిడ్డకు తండ్రి. అందుకే ఇప్పుడు తన బిడ్డ దేవాన్ష్ విషయంలో తనకున్న వాత్సల్యాన్ని చాటుకున్నారు. బిజీ షెడ్యూల్లో కూడా దేవాన్ష్ చదువుతున్న పాఠశాల లో తల్లిదండ్రుల సమావేశానికి హాజరయ్యారు నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగంతో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తల్లిదండ్రుల సమావేశానికి..
నారా లోకేష్( Nara Lokesh ) రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయనకు ఒక కుమారుడు దేవాన్సు ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాదులోని ఓ పాఠశాలలో చదువుతున్నారు. దేవాన్ష్ చదువు బాధ్యతలను తల్లి నారా బ్రాహ్మణి చూసుకుంటూ వస్తోంది. మొన్న ఆ మధ్యన లోకేష్ దేవాన్ష్ విషయంలో బ్రాహ్మణి చొరవను ప్రస్తావించారు. తన కుమారుడు దేవాన్ష్ చదువుతున్న పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు ఎన్నడూ వెళ్లలేదని.. కానీ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారని గుర్తు చేసుకున్నారు లోకేష్. అయితే అక్కడకి కొద్ది రోజుల తర్వాత ఈరోజు కుమారుడు దేవాన్ష్ కోరిక మేరకు తల్లిదండ్రుల సమావేశానికి హాజరయ్యారు నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు.
Also Read: కొలికపూడి మళ్లీ కెలికాడు.. వీడియో వైరల్!
ఆసక్తికరంగా ట్వీట్..
అయితే పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశానికి హాజరైన లోకేష్ ట్వీట్( tweet) చేశారు. కుమారుడు, భార్యతో కలిసి తీసుకున్న సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టారు.’ ప్రజా జీవితంలో తీరిక లేకుండా ఉన్న సమయంలో.. ఇలాంటి క్షణాలు ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి. దేవాన్ష్ నువ్వు చెప్పే ముచ్చట్లు తండ్రిగా సంతోషాన్ని ఇస్తున్నాయి. కుమార్ రెడ్డి గారు నిన్ను చూసి గర్వపడుతున్నాను ‘ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Took a day off to accompany Devaansh to his Parent-Teacher Meeting today. Public life keeps you on your toes, so moments like these feel even more special. His little world, his stories, and his smile make fatherhood truly magical. We are proud of you, Devaansh! pic.twitter.com/EwNT2XeGFK
— Lokesh Nara (@naralokesh) August 2, 2025