Viveka Daughter Sunitha: కడపలో( Kadapa ) జడ్పిటిసి ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. హోరా హోరీ పోరు తప్పేలా లేదు. ముఖ్యంగా పులివెందులలో పోరు పతాక స్థాయికి చేరుకుంది. ఎత్తుకు పైఎత్తులు సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సొంత జిల్లాలో వైసీపీకి షాకింగ్ ఫలితాలు వచ్చాయి. పది స్థానాలకు గాను ఏడింట టిడిపి కూటమి ఘన విజయం సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ మూడు స్థానాలు మాత్రమే పరిమితం అయింది. అందుకే ఇప్పుడు జగన్ సొంత గడ్డలో మట్టి కరిపించేందుకు టిడిపి ప్రభుత్వం చేస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం అదే స్థాయిలో తమ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read: మూడు వారాల్లో రిటైర్మెంట్.. ఆ అధికారి కక్కుర్తి ఎంత అంటే?
* టిడిపిలో చేరికలు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. పెద్ద ఎత్తున టిడిపిలోకి చేరికలు పెరగడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. జగన్ అండ్ కో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి కుమార్తె సునీత తెరపైకి వచ్చారు. వివేకానంద రెడ్డి హత్య పై గట్టి వ్యాఖ్యలే చేశారు. వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా పులివెందులకు వచ్చారు సునీత. వివేకా హత్యలు ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రను మరోసారి ప్రస్తావించారు. వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు కనీసం ఊరేగింపు కూడా నిర్వహించలేని విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా సునీత చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళనకు అదే కారణం అవుతోంది.
* వివేకాతో అనుబంధం..
వైయస్ కుటుంబం అంటే పులివెందుల( pulivendula) ప్రజలకు చాలా ఇష్టం. ప్రతి ఒక్కరి కష్టసుఖాల్లో ఉండేది ఆ కుటుంబం. అయితే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినా.. పులివెందులలో ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునేవారు వివేకానంద రెడ్డి. అంతలా దశాబ్దాలుగా పెన వేసుకుంది ఆ బంధం. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత వివేకానంద రెడ్డి ప్రాధాన్యతను తగ్గించారు జగన్మోహన్ రెడ్డి. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి ప్రాధాన్యమిచ్చారు. అయితే వివేకానంద రెడ్డి మాదిరిగా భాస్కర్ రెడ్డి పులివెందులలో ప్రభావం చూపలేకపోయారు. మొన్నటి ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం మాత్రం వివేకానంద రెడ్డి హత్య అంశమే. ఇప్పుడు అదే అంశాన్ని తెరపైకి తెచ్చి సునీత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బతీశారు.
* బీటెక్ రవి దూకుడు..
ఇంకో వైపు బీటెక్ రవి( BTech Ravi ) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానంద రెడ్డిని ఓడించిన ఘనత బీటెక్ రవిది. కడపలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీటెక్ రవి అనూహ్య విజయాన్ని సాధించారు. పులివెందులలో పట్టు సాధించారు. అందుకే ఇప్పుడు తన భార్యను గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇంకోవైపు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి, జిల్లా మంత్రి సవిత, శ్రీనివాస్ రెడ్డి.. ఇలా అంతా ఒక పద్ధతి ప్రకారం, వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. అయితే టిడిపి తో పోల్చుకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రచారంలో కూడా వెనుకబడింది. ఈనెల 12న పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు రానున్నాయి. మరి ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.