Pastor Praveen Kumar Incident
Pastor Praveen Kumar Incident : తలకు జావా కంపెనీ హెల్మెట్(Java company helmet) ధరించారు. కాళ్లకు తెలుపు రంగు బూట్లు వేసుకున్నారు. బుల్లెట్ వెనుక ఒక బ్యాగ్ కూడా పెట్టుకున్నారు. విజయవాడ చేరుకునే లోపు ప్రవీణ్ కుమార్ అనేక చోట్ల ఆగారు. ఎప్పటికీ ఎక్కడా హెల్మెట్ తీయలేదు. విజయవాడ చేరుకున్న తర్వాత రామవరప్పాడు రింగ్ సమీపంలో పగడాల ప్రవీణ్ కుమార్ కింద పడిపోయారు. అయితే పగడాల ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న బుల్లెట్ హెడ్లైట్ పగిలిపోయింది. దాని వైరు వేలాడుతూ కనిపించింది. సేఫ్టీ రాడ్లు వంగిపోయాయి. చేతుల మీద ఉన్న చర్మం కొట్టుకుపోయింది. హెల్మెట్ కు సొట్టపడింది.. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు.. పాస్టర్ ప్రవీణ్ కుమార్ ను ఫోటో తీశారు. అయితే బుల్లెట్ పై పడిపోవడంతో.. రామవరప్పాడు జంక్షన్ వద్ద ఉన్న ఆటోడ్రైవర్లు ఈ విషయాన్ని అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుకు తెలియజేశారు. దీంతో అతడిని ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు నేషనల్ హైవే పక్కన ఉన్న రెయిలింగ్ పై కూర్చోబెట్టారు. ముఖం కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న హోటల్ నుంచి టీ కూడా తెప్పించారు. మద్యం తాగి వాహనం నడపొద్దని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు పాస్టర్ ప్రవీణ్ కుమార్ నడిపిన బుల్లెట్ బండిని తోసుకుంటూ వచ్చారు. అతడు ఉన్నచోట స్టాండ్ వేసి అప్పగించారు. అయితే మద్యం తాగిన వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ కుమార్ అనే విషయం తనకు తెలియదని ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న సుబ్బారావు వెల్లడించారు.. మద్యం తాగి వాహనం నడిపితే ఎలాంటి అనర్ధాలు చోటు చేసుకుంటాయో అని చెప్పడానికే తాను ఫోటో తీశానని.. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన తీసిన ఫోటోలే ఈ కేసులో అత్యంత కీలకంగా మారాయి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఘటనలో దర్యాప్తు వేగంగా జరగడానికి దోహదం చేస్తున్నాయి.
Also Read : ఒక్క రాంగ్ కాల్.. ఆమె జీవితాన్ని కష్టాల్లో నెట్టింది!
సీసీ కెమెరాలలో చూపించిన సమయాలు ఏంటంటే..
ప్రవీణ్ కుమార్ పెట్రోల్ బంక్ లో సాయంత్రం నాలుగు గంటల 45 నిమిషాలకు పెట్రోల్ కొట్టించుకున్నారు.
అదేరోజు సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు మహానాడు కూడలిలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ జాతీయ రహదారిపై ఉన్న సీసీ కెమెరాలో కనిపించారు.
ఐదు గంటల 30 నిమిషాలకు పోలీసులు రామవరప్పాడు రింగ్ వద్ద ట్రాఫిక్ బూత్ వద్దకు ఆటో డ్రైవర్లు తీసుకువచ్చారు
సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 20 నిమిషాల వరకు నేషనల్ హైవే పక్కన ఉన్న రైలింగ్ పై పెంచుతున్న పచ్చ గడ్డిలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ నిద్రపోయారు.
రాత్రి 8 గంటల 47 నిమిషాలకు రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి ఏలూరు వైపు వెళ్లిపోయారు. అప్పటికే ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు ప్రవీణ్ కుమార్ కు టీ అందించారు.
మద్యం తాగి వాహనం నడపద్దని.. చూస్తుంటే చదువుకున్న వారిలా ఉన్నారని.. ఇలాంటి పనులు సరికాదని సుబ్బారావు వారించినప్పటికీ ప్రవీణ్ కుమార్ వినిపించుకోలేదు.
ప్రవీణ్ కుమార్ హెల్మెట్ గీసుకుపోవడం.. బుల్లెట్ వాహనం కూడా దెబ్బ తినడంతో.. ఎస్ఐ సుబ్బారావు తన ఫోన్లో ఫోటోలు తీశారు.
ఈ కేసు దర్యాప్తులో ప్రస్తుతం ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు తీసిన ఫోటోలు.. సీసీ కెమెరాలో కనిపించిన దృశ్యాలు అత్యంత కీలకంగా మారాయి. మొత్తంగా చూస్తే పాస్టర్ ప్రవీణ్ కుమార్ కేసులో చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడిపోతున్నాయి.
Also Read : పాస్టర్ ప్రవీణ్.. విజయవాడలో అంత సేపు ఏం చేశారు?